ODI World Cup 2023 : కేఎల్ రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్లు అక్రమ్, మాలిక్ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా తరపున ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మొదటి స్థానంలో కేెఎల్ రాహుల్ నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Shoaib Malik

KL Rahul – Shoaib Malik : భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్ 2023 టోర్నీలో టీమిండియా అద్భుత ప్రదర్శన ఇస్తుంది. ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యాయి. తొమ్మిది మ్యాచ్ లు ఆడిన టీమిండియా అన్నింటిలోనూ విజయం సాధించింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ లో ఆదివారం చిన్నస్వామి స్టేడియంలో నెదర్లాండ్స్ జట్టుతో తలపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ సెంచరీలు చేశారు. కేఎల్ రాహుల్ కేవలం 62 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. దీంతో టీమిండియా తరపున ఫాసెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా మొదటి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో రాహుల్ పై పాక్ మాజీ కెప్టెన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read : ODI World Cup 2023: బెస్ట్ ఫీల్డర్ అవార్డు.. ఈసారి వెరైటీగా ఇచ్చారు..! ఎవరికి దక్కిందో వీడియోలో చూడండి..

పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రపంచ కప్ లో అత్యుత్తమ నెం. 5 బ్యాటర్ రాహుల్ అని ప్రశంసించాడు. ప్రపంచ క్రికెట్ లో 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే బ్యాటర్లలో రాహుల్ అత్యుత్తమం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయగలడు. భారత్ జట్టు ఆరంభంలోనే రెండుమూడు వికెట్లు కోల్పోయినప్పటికీ పరిస్థితికి అనుగుణంగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించగలిగే సమర్థత రాహుల్ సొంతం అంటూ పాక్ మాజీ కెప్టెన్ ప్రశంసల జల్లు కురిపించాడు.

Also Read : ODI World Cup 2023 : భారత్ బ్యాటర్ల సిక్సర్ల మోతతో దద్దరిల్లిన చినస్వామి స్టేడియం.. వీడియో చూడండి ..

కేఎల్ రాహుల్ స్పిన్నర్లతో పాటు పేసర్ల బౌలింగ్ లోనూ వేగంగా పరుగులు రాబట్టగలడు. మైదానంలో ఫీల్డర్ లేని ప్రదేశాలను ఎంచుకొని మరీ షాట్లు కొడుతున్నాడు. ఆస్ట్రేలియా – ఇండియా మ్యాచ్ లోనూ రాహుల్ అద్భుత ప్రదర్శనతో టీమిండియాను విజయతీరాలకు చేర్చగలిగాడని మాలిక్ అన్నాడు.

అదేవిధంగా మరో పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, పాక్ ప్లేయర్ మిస్బావుల్ హక్ సైతం రాహుల్ పై ప్రశంసల జల్లు కురిపించారు. కేఎల్ రాహుల్ కంటే గ్లెన్ మాక్స్ వెల్ పై బౌలింగ్ చేయడం సులభమని అక్రమ్ అన్నాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ లో అక్రమ్ మాట్లాడుతూ.. మాక్స్ వెల్ ను ఔట్ చేసే అవకాశం బౌలర్లకు ఎక్కువగా ఉంటుంది.. కానీ, కేఎల్ రాహుల్ విషయంలో అలా జరగదని అన్నాడు. అతను స్థిరమైన బ్యాటర్. టెస్ట్, వన్డే, టీ20ల్లో డిఫెరెంట్ రోల్ లో రాణిస్తున్నాడని ప్రశంసించాడు. కేఎల్ రాహుల్ కు బౌలింగ్ చేయడం చాలా కష్టం అని మిస్బా అన్నాడు.