HCA Elections: హెచ్‌సీఏ ఎన్నికలపై మాజీల కన్ను.. అజరుద్దీన్‌తో సహా బరిలోకి దిగేందుకు పలువురు మాజీల ఆసక్తి ..

హెచ్‌సీఏ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో అజరుద్దీన్‌తోపాటుమాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివ‌లాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్షులు‌గా పోటీ చేస్తానని శేషు నారాయణ ప్రకటించారు.

HCA

HCA Elections: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) లో ఎన్నికల కోలాహలం నెలకుంటోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరిలోకి దిగేందుకు మాజీలు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పలువురు మాజీలు ఇప్పటికే తమ కార్యాచరణను ప్రారంభించినట్లు సమాచారం. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు‌చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం విధితమే. దీంతో హెచ్‌సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అజారుద్దీన్‌ (Mohammad Azharuddin) కు కోర్టు షాకిచ్చింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను ఏకసభ్య కమిటీ చూసుకుంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.

HCA: తీరు మార్చుకోని హెచ్‌సీఏ.. ఫ్యాన్స్‌‎తో మరోసారి ఆటలు

హెచ్‌సీఏ ఎన్నికల బాధ్యతలు చూసుకోవాలని నాగేశ్వరరావును నియమించిన సుప్రీంకోర్టు, సభ్యులు నాగేశ్వరరావు‌కు సహకరించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో హెచ్‌సీఏ ఎన్నికలకు మాజీ అధ్యక్షులు, హెచ్‌సీఏ మెంబర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

 

అజరుద్దీన్‌తోపాటు ఈసారి మాజీలు బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. వినోద్ వెంకటస్వామి, శేషు నారాయణ, శివ‌లాల్ యాదవ్, హర్షద్ అయూబ్‌లు మరోసారి హెచ్‌సీఏ అధ్యక్ష పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధ్యక్షులు‌గా పోటీ చేస్తానని శేషు నారాయణ ప్రకటించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో క్లబ్ మెంబెర్స్ ఓట్లు కీలకం కానున్నాయి. అంతర్గత కుమ్ములాట‌తో హెచ్‌సీఏ అధ్యక్షులపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు ఎందరు ముందుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది.