French Open: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో పాటు విలియమ్స్ రికార్డ్ సమం చేసిన స్వైటెక్

పోలాండ్ యువ కెరటం మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలచుకుంది. ఫిబ్రవరి నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్తోన్న ఇగా స్వైటెక్.. ఫైనల్ పోరులో అమెరికా ప్లేయర్ కోకో గాఫ్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫోర్ హ్యండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది.

French Open (1)

French Open: పోలాండ్ యువ కెరటం మరోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలచుకుంది. ఫిబ్రవరి నుంచి ఓటమెరుగకుండా దూసుకెళ్తోన్న ఇగా స్వైటెక్.. ఫైనల్ పోరులో అమెరికా ప్లేయర్ కోకో గాఫ్‌పై సునాయాస విజయాన్ని అందుకుంది. 6-1, 6-3 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీసింది. ఫోర్ హ్యండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడింది.

కేవలం 68 నిమిషాల్లో ముగించిన స్వైటెక్.. 2020లో తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ విన్నర్ గా నిలిచింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ ఆడి టాప్ 50లో ఒకరిగా నిలిచింది.

పోలాండ్ రాజధాని వెర్సాలో పుట్టిన ఇగా.. అక్క టెన్నిస్ ఆడటాన్ని చూసి ఇటు వైపుకు అడుగులేసింది. తొలిసారి 2018లో జూనియర్ వింబుల్డన్ ఛాంపియన్ అయిందామె. పదునైన బ్యాక్ హ్యాండ్ టాలెంట్ తో కనిపించే స్వైటెక్‌కు కోర్టు స్వభావంతో సంబంధం లేదు. పవర్ తో కూడిన షాట్ లు సంధించి మెరుపు వేగంతో ప్రత్యర్థికి ఎదుర్కొనే సమయం కూడా ఇవ్వదు.

Read Also: ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత జకోవిచ్

కొన్ని నెలలుగా గెలుస్తూ వస్తున్న స్వైటెక్.. వరుసగా 35మ్యాచ్ లలో గెలిచింది. గతంలో వీనస్ విలియమ్స్ పేరిట ఈ ఘనత ఉంది. మోస్ట్ సక్సె స్‌ఫుల్ ప్లేయర్ ఆఫ్ ద సెంచరీగా ఇగా పేరు దక్కించుకుంది. మరొక్క గేమ్ గెలిస్తే వీనస్ విలియమ్స్ రికార్డ్ బ్రేక్ చేసినట్లే.