Gautam Gambhir : అఫ్గాన్‌తో మ్యాచ్‌కు ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు..
అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- June 5, 2026 / 01:05 PM IST
Gautam Gambhir Confirms Sai Sudharsan Return To Test XI
- శనివారం నుంచి అఫ్గాన్‌తో మ్యాచ్..
- మ్యాచ్ కు ముందు విలేకరుల సమావేశంలో పాలొన్నగౌతమ్ గంభీర్
- సాయి సుదర్శన్ పై కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir : టెస్టుల్లో సాయి సుదర్శన్‌కు గతంలో సరైన అవకాశాలు రాలేదని, అందుకే అఫ్గానిస్థాన్‌తో శనివారం నుంచి జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో అతడిని ఆడిస్తామని టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తెలిపాడు. మ్యాచ్‌కు ఒక రోజు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంభీర్ మాట్లాడాడు.
మూడో స్థానంలో సాయిసుదర్శన్‌కు సరైన అవకాశాలు రాలేదని, అఫ్గాన్‌తో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ కంటే కూడా సాయి సుదర్శన్‌కే ప్రాధాన్యం ఇస్తామన్నాడు. సాయి సుదర్శన్ ఎక్కువగా ఇంగ్లాండ్‌లోనే ఆడాడని చెప్పుకొచ్చాడు. అక్కడ విఫలం కాగానే పక్కన పెట్టడం సరికాదన్నాడు.
‘మేము 11 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకోగలం. సాయి సుదర్శన్ కూడా చెడ్డ ఫామ్‌లో లేడు. అతను ఐపీఎల్‌లో 700 పైగా పరుగులు చేశాడు. కేవలం 4-5 మ్యాచ్‌ల ఆధారంగా సాయిని అంచనా వేస్తే.. మనం ఎప్పటికీ ఓ మంచి జట్టును నిర్మించలేము.’ అని గౌతమ్ గంభీర్ అన్నాడు.
తాము శ్రీలంక పర్యటనకు నలుగురు స్పిన్నర్లతో వెళ్లాలని అనుకుంటున్నామని అన్నాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో మానవ్ సుతార్, హర్ష్ దూబేలు ఎలా రాణిస్తారనేది చూడాల్సి ఉందన్నాడు. ఇద్దరూ ఒకే రకమైన బౌలర్లు అయినప్పటికి కూడా బంతిని రిలీజ్ చేసే విధానం భిన్నంగా ఉంటుందన్నాడు.
టెస్టు వెస్ట్ కెపెన్సీ నుంచి రిషబ్ పంత్ ను తొలగించడం పై స్పందిస్తూ.. అతడికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నాడు. రిషబ్ తన ఆట తీరు మార్చుకోవాలని తాము కోరుకోవడం లేదన్నాడు. అదే సమయంలో మ్యాచ్ పరిస్థితులను గౌరవించాల్సి ఉంటుందన్నాడు.
