MS Dhoni: ఆటోగ్రాఫ్ ఇచ్చి చాక్లెట్ తీసుకున్న ధోనీ.. వీడియో వైరల్
దీంతో ఆ అభిమాని తన చేతిలోని చాక్లెట్ ను ధోనీకి ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ 2023 చూడడానికి ధోనీ..
- T Venkateshwarlu
- Updated on- September 11, 2023 / 05:39 PM IST
MS Dhoni
MS Dhoni – Video: ఐపీఎల్(IPL)లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి సంబంధించిన ఓ వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ తన నిరాడంబరత వల్ల తరుచూ వార్తల్లో నిలుస్తున్నాడు.
అతడి సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అయిపోతారు. తాజాగా, ధోనీని అమెరికాలో ఓ అభిమాని కలిశాడు. చిన్న చిన్న బ్యాట్లపై అతడికి ధోనీ ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. అనంతరం ధోనీ అక్కడి నుంచి వెళ్లిపోతూ చాక్లెట్ ఇచ్చేయ్ అని అన్నాడు.
దీంతో ఆ అభిమాని తన చేతిలోని చాక్లెట్ ను ధోనీకి ఇచ్చాడు. యూఎస్ ఓపెన్ 2023 చూడడానికి ధోనీ అమెరికా వెళ్లాడు. ఈ సందర్భంగా అమెరికాలో క్రికెట్ అభిమానులు ధోనీ వెంటపడ్డారు. ధోనీతో ఫొటోలు దిగుతూ, ఆటోగ్రాఫ్‌లు తీసుసుకుంటూ అభిమానులు సంబరపడిపోయారు. ధోనీకి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పదే పదే వైరల్ అవుతుంటాయి. ఆయన ప్రేక్షకులను నిరాశకు గురి చేయకుండా ఫొటోలు ఇస్తుంటాడు.
