IND vs PAK : 128 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన పాక్‌

ఆసియాకప్‌లో సూపర్‌-4 దశలో భాగంగా కొలంబోలో భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి.

IND vs PAK : 128 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన పాక్‌

KL Rahul-Virat Kohli

ఆసియాకప్‌లో సూపర్‌-4 దశలో భాగంగా కొలంబో వేదిక‌గా పాకిస్తాన్‌తో జ‌రిగిన మ్యాచులో భార‌త్ స‌త్తా చాటింది. అన్ని విభాగాల్లో రాణించి ఘ‌న విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 11 Sep 2023 11:08 PM (IST)

    భార‌త్ ఘ‌న విజ‌యం

    357 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ 32 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ 228 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొంది.

  • 11 Sep 2023 10:59 PM (IST)

    ఫహీమ్ అష్రఫ్ ఔట్

    పాకిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్‌ బౌలింగ్‌లో (31.6వ ఓవ‌ర్‌) ఫహీమ్ అష్రఫ్ ఔట్ (4; 12 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 128 ప‌రుగుల వ‌ద్ద 8 వికెట్ కోల్పోయింది. 32 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 128/8. షాహీన్ అఫ్రిది (7) క్రీజులో ఉన్నాడు.

  • 11 Sep 2023 10:48 PM (IST)

    ఇఫ్తికార్ అహ్మద్ ఔట్

    పాకిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్‌ బౌలింగ్‌లో (29.3వ ఓవ‌ర్‌) ఇఫ్తికార్ అహ్మద్ (23; 35 బంతుల్లో 1 ఫోర్‌) అత‌డికే క్యాచ్ ఇచ్చి ఔటైయ్యాడు. దీంతో పాకిస్తాన్ 119 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 30 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 119/7. ఫహీమ్ అష్రఫ్ (1), షాహీన్ అఫ్రిది (0) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 10:40 PM (IST)

    షాదాబ్ ఖాన్ ఔట్..

    పాకిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్‌ బౌలింగ్‌లో (27.4వ ఓవ‌ర్‌) షాదాబ్ ఖాన్ (6; 10 బంతుల్లో) శార్దూల్ చేతికి చిక్కాడు. దీంతో పాకిస్తాన్ 110 ప‌రుగుల వ‌ద్ద ఆరో వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 28 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 111/6. ఇఫ్తికార్ అహ్మద్ (16), ఫహీమ్ అష్రఫ్ (1) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 10:26 PM (IST)

    ఆఘా సల్మాన్ ఔట్

    పాకిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్‌ బౌలింగ్‌లో (23.6వ ఓవ‌ర్‌) ఆఘా సల్మాన్ (23; 32 బంతుల్లో 2 ఫోర్లు) ఎల్భీ డ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 96 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 24 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 96/5. ఇఫ్తికార్ అహ్మద్ (8) క్రీజులో ఉన్నాడు.

  • 11 Sep 2023 10:01 PM (IST)

    ఫఖర్ జమాన్ క్లీన్ బౌల్డ్‌

    పాకిస్తాన్ మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్‌ బౌలింగ్‌లో (19.2వ ఓవ‌ర్‌) ఫఖర్ జమాన్ (27; 50 బంతుల్లో 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో పాకిస్తాన్ 77 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 20 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 79/4. ఆఘా సల్మాన్ (13), ఇఫ్తికార్ అహ్మద్ (1) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 09:51 PM (IST)

    క‌ట్టుదిట్టంగా భార‌త బౌలింగ్‌

    భార‌త బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. శార్దూల్ ఠాకూర్ వేసిన 16వ ఓవ‌ర్‌లో మూడు ప‌రుగులు రాగా, హార్దిక్ వేసిన 17 ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగే వ‌చ్చింది. 17 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 69/3. ఫఖర్ జమాన్(21), ఆఘా సల్మాన్ (10) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 09:27 PM (IST)

    రిజ్వాన్ ఔట్‌..

    వ‌రుణుడు తెరిపి నివ్వ‌డంతో మ్యాచ్ పునఃప్రారంభం కాగా.. పాకిస్తాన్‌కు భారీ షాక్ త‌గిలింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (2; 5 బంతుల్లో) కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. దీంతో పాకిస్తాన్ 47 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 47/3. ఫఖర్ జమాన్(14), ఆఘా సల్మాన్ (0) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 09:23 PM (IST)

    మొద‌లైన మ్యాచ్‌.. ఓవ‌ర్ల కోత లేదు

    వ‌ర్షం ఆగిపోవ‌డంతో సిబ్బంది మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేశారు. చాలా స‌మ‌యం న‌ష్ట‌పోయిన‌ప్ప‌టికీ ఎటువంటి ఓవ‌ర్ల కోత లేకుండానే మ్యాచ్‌ను నిర్వ‌హిస్తున్నారు.

  • 11 Sep 2023 08:17 PM (IST)

    మొద‌లైన వ‌ర్షం..

    పాకిస్తాన్ ఇన్నింగ్స్ 11 ఓవ‌ర్లు పూర్తి కాగానే వ‌రుణుడు వ‌చ్చేశాడు. వ‌ర్షం మొద‌లుకావ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. మైదాన సిబ్బంది గ్రౌండ్‌ను క‌వ‌ర్ల‌తో క‌ప్పారు. 11 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 44/2. ఫఖర్ జమాన్(14), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 08:05 PM (IST)

    బాబ‌ర్ ఆజామ్ క్లీన్ బౌల్డ్‌..

    పాకిస్తాన్ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో (10.4వ ఓవ‌ర్‌) కెప్టెన్ బాబ‌ర్ ఆజామ్ (10; 24 బంతుల్లో 2 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 43 ప‌రుగుల వ‌ద్ద పాకిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 44 2. ఫఖర్ జమాన్(14), మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (1) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 07:54 PM (IST)

    మారిన వికెట్ కీప‌ర్‌.. ఇషాన్ బ‌దులు రాహుల్‌

    ఆరు ఓవ‌ర్ల వ‌ర‌కు ఇషాన్ కిష‌న్ కీపింగ్ చేయ‌గా ఇప్పుడు కేఎల్ రాహుల్ గ్లౌజులు అందుకున్నాడు. ఏడో ఓవ‌ర్‌ నుంచి కేఎల్ రాహుల్ కీపింగ్ చేస్తున్నాడు. ప్ర‌పంచ‌క‌ప్ నేప‌థ్యంలో రాహుల్‌కు కీపింగ్ ప్రాక్టీస్ కూడా కావాల‌ని భావించి రోహిత్ శ‌ర్మ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది. బుమ్రా వేసిన ఈ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 7 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 21/1. ఫఖర్ జమాన్(4), బాబ‌ర్ ఆజామ్ (0) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 07:39 PM (IST)

    ఇమామ్ ఔట్‌

    పాకిస్తాన్‌కు మొద‌టి షాక్ త‌గిలింది. భార‌త పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో (4.2వ ఓవ‌ర్‌)లో ఇమామ్ (9) శుభ్‌మ‌న్ గిల్ చేతికి చిక్కాడు. దీంతో పాకిస్తాన్ 17 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 17/1. ఫఖర్ జమాన్(0), బాబ‌ర్ ఆజామ్ (0) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 07:36 PM (IST)

    ల‌క్ష్య ఛేద‌న‌కు దిగిన పాకిస్తాన్‌

    భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్ బ‌రిలోకి దిగింది. ఫఖర్ జమాన్, ఇమామ్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. మొద‌టి ఓవ‌ర్‌ను బుమ్రా వేయ‌గా 5 ప‌రుగులు వ‌చ్చాయి. రెండో ఓవ‌ర్‌ను సిరాజ్ వేయ‌గా ఆరు ప‌రుగులు, మూడో ఓవ‌ర్‌ను వేసిన బుమ్రా నాలుగు ప‌రుగులు ఇచ్చాడు. 3 ఓవ‌ర్ల‌కు పాకిస్తాన్ స్కోరు 15/0. ఫఖర్ జమాన్(0), ఇమామ్ (8) క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 06:41 PM (IST)

    పాకిస్తాన్ టార్గెట్ 357

    పాకిస్తాన్ పై భార‌త బ్యాట‌ర్లు దుమ్ములేపారు. విరాట్ కోహ్లీ (122 నాటౌట్‌; 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స‌ర్లు), కేఎల్ రాహుల్ లు(111 నాటౌట్; 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సెంచ‌రీల‌తో విరుచుకుప‌డ‌గా, ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ (56; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (58; 52 బంతుల్లో 10 ఫోర్లు) లు అర్థ‌శ‌త‌కాల‌తో స‌త్తా చాట‌డంతో భార‌త్ భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్ల న‌ష్టానికి 356 ప‌రుగులు చేసింది. దీంతో పాకిస్తాన్ ముందు 357 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది.

  • 11 Sep 2023 06:27 PM (IST)

    విరాట్ కోహ్లీ సెంచ‌రీ

    ప‌రుగుల యంత్రం విరాట్ కోహ్లీ శ‌త‌కంతో అద‌ర‌గొట్టాడు. షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో (47.3వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో సెంచ‌రీ పూర్తి చేశాడు. కాగా.. వ‌న్డేల్లో విరాట్‌కు ఇది 47వ సెంచ‌రీ కావ‌డం విశేషం

  • 11 Sep 2023 06:24 PM (IST)

    కేఎల్ రాహుల్ సెంచ‌రీ..

    గాయం నుంచి కోలుకుని వచ్చిన కేఎల్ రాహుల్ ఎలా ఆడతాడోన‌నే అభిమానుల అనుమానాల‌ను ప‌టా పంచ‌లు చేశాడు. శ‌త‌కంతో చెల‌రేగాడు. నసీమ్ షా బౌలింగ్‌లో (46.6వ ఓవ‌ర్‌) రెండు ప‌రుగులు తీసి 100 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్ల సాయంతో సెంచ‌రీ చేశాడు. 47 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 319/2. విరాట్ కోహ్లీ (97), కేఎల్ రాహుల్ (100) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 06:15 PM (IST)

    14 ప‌రుగులు

    45వ ఓవ‌ర్‌ను ఫహీమ్ అష్రఫ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో రాహుల్ రెండు పోర్లు బాద‌డంతో మొత్తంగా 14 ప‌రుగులు వ‌చ్చాయి. 45 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 300/2. విరాట్ కోహ్లీ (83), కేఎల్ రాహుల్ (95) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 05:54 PM (IST)

    కోహ్లీ ఫోర్‌

    ఫహీమ్ అష్రఫ్ 40వ ఓవ‌ర్‌ను వేశాడు. ఈ ఓవ‌ర్‌లో కోహ్లీ ఓఫోర్ కొట్టడంతో 8 ప‌రుగులు వ‌చ్చాయి. 40 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 251/2. కేఎల్ రాహుల్ (72), విరాట్ కోహ్లీ(57) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 05:47 PM (IST)

    విరాట్ కోహ్లీ అర్థ‌శ‌త‌కం..

    ప‌రుగుల యంత్రం, రికార్డు రారాజు విరాట్ కోహ్లీ త‌న‌కు అచ్చొచ్చిన ఆసియాక‌ప్‌లో మరోసారి అద‌ర‌గొట్టాడు. షాదాబ్ ఖాన్ బౌలింగ్‌లో (38.3వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి 55 బంతుల్లో 4 ఫోర్లు సాయంతో అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 39 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 243/2. కేఎల్ రాహుల్ (71), విరాట్ కోహ్లీ(50) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 05:35 PM (IST)

    శ‌త‌క భాగ‌స్వామ్యం..

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన భార‌త్‌ను విరాట్‌, రాహుల్ జోడి ఆదుకుంది. వీరిద్ద‌రు కేవ‌లం 103 బంతుల్లోనే 102 ప‌రుగులు జోడించారు. ఇన్నింగ్స్ 35 ఓవ‌ర్‌ను షాదాబ్ వేయ‌గా రాహుల్ ఓ సిక్స్‌, ఫోర్ కొట్టడంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 14 ప‌రుగులు వ‌చ్చాయి. 35 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 225/2. కేఎల్ రాహుల్ (63), విరాట్ కోహ్లీ(40) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 05:25 PM (IST)

    కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీ

    ఫహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో(32.1వ ఓవ‌ర్‌) సింగిల్ తీసి కేఎల్ రాహుల్ 60 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో కోహ్లీ ఓ ఫోర్ కొట్టాడు. మొత్తంగా 7 ప‌రుగులు వ‌చ్చాయి. 34 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 211/2. కేఎల్ రాహుల్ (51), విరాట్ కోహ్లీ(38) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 05:13 PM (IST)

    కేఎల్ రాహుల్ దూకుడు

    కేఎల్ రాహుల్ దూకుడు పెంచాడు. 31వ ఓవ‌ర్‌ను ఇఫ్తికార్ అహ్మద్ వేయ‌గా మొద‌టి రెండు బంతుల‌ను సిక్స్‌, ఫోర్‌గా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 31 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 186/2. విరాట్ కోహ్లీ (22), కేఎల్ రాహుల్ (42) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 04:56 PM (IST)

    రెండు ఓవ‌ర్లు.. 5 ప‌రుగులు

    వ‌ర్షం ప‌డ‌డంతో పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా మారింది. దీంతో భార‌త బ్యాట‌ర్లు ఎలాంటి రిస్క్‌లు తీసుకోవ‌డం లేదు. ఆచితూచి ఆడుతున్నారు. న‌సీమ్ షా వేసిన 26వ ఓవ‌ర్‌లో రెండే ప‌రుగులు రాగా.. ఫహీమ్ అష్రఫ్ వేసిన 27 ఓవ‌ర్‌లో 3 ప‌రుగులు వ‌చ్చాయి. 27 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 155/2. విరాట్ కోహ్లీ (12), కేఎల్ రాహుల్ (21) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 04:48 PM (IST)

    ప్రారంభ‌మైన మ్యాచ్‌..

    దాదాపు గంట‌న్న‌ర ఆల‌స్యంగా మ్యాచ్ ప్రారంభ‌మైంది. నిన్న 24.1 ఓవ‌ర్ల వ‌ద్ద మ్యాచ్ ఆగిపోయిన విష‌యం తెలిసిందే. షాదాబ్ ఖాన్ త‌న‌ ఓవ‌ర్‌ను పూర్తి చేశాడు. ఈ ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి. 25 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 150/2. విరాట్ కోహ్లీ (9), కేఎల్ రాహుల్ (19) లు క్రీజులో ఉన్నారు.

  • 11 Sep 2023 04:30 PM (IST)

    శుభ‌వార్త‌.. మొద‌లుకానున్న మ్యాచ్‌..

    అంపైర్లు మైదానాన్ని మ‌రోసారి ప‌రిశీలించారు. మ్యాచ్ నిర్వ‌హించేందుకు అనుకూల ప‌రిస్థితులు ఉండ‌డంతో మ్యాచ్ నిర్వ‌హించేందుకు నిర్ణ‌యం తీసుకున్నారు. 4.40 గంట‌ల‌కు మ్యాచ్ మొద‌లు కానుంది. నిన్న మ్యాచ్ ఎక్క‌డ ఆగిపోయిందో అక్క‌డి నుంచే మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది.

  • 11 Sep 2023 04:13 PM (IST)

    4.20 గంట‌ల‌కు మ‌రోసారి మైదానాన్ని ప‌రిశీలించ‌నున్న అంపైర్లు

    వ‌ర్షం త‌గ్గిన‌ప్ప‌టికీ మైదానంలో ప‌లు చోట్ల త‌డిగా ఉండ‌డంతో మ్యాచ్ ఆరంభం కాలేదు. మైదాన సిబ్బంది తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో అంపైర్లు మైదానాన్ని ప‌రిశీలించారు. ఇంకా కొన్ని చోట్ల నీళ్లు ఉండ‌డంతో 4.20pm గంట‌ల‌కు మ‌రోసారి మైదానాన్ని ప‌రిశీలించాల‌ని నిర్ణ‌యించారు అంపైర్లు.

  • 11 Sep 2023 03:03 PM (IST)

    ఆనందం కొద్దిసేపే..

    మ‌ళ్లీ మైదానాన్ని క‌వ‌ర్ల‌తో క‌ప్పేస్తున్నారు. రెండో రోజు కూడా అదే ప‌రిస్థితి ఉంది. పాక్ ఆట‌గాళ్లు రవూఫ్, నవాజ్ మొత్తం మైదానాన్ని కవర్ చేయడానికి ఉపయోగించిన కవర్ల సంఖ్యను లెక్కిస్తున్నారు. మైదానానికి చేరుకున్న కొంత మంది అభిమానులు మ్యాచ్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

  • 11 Sep 2023 02:57 PM (IST)

    శుభ‌వార్త‌..

    ఈ రోజు కూడా వ‌ర్షం ప‌డుతోంది. అయితే.. మ్యాచ్‌కు ముందు వ‌ర్షం ఆగిపోయింది. మైదాన సిబ్బంది గ్రౌండ్‌లోని క‌వ‌ర్ల‌ను తొల‌గించారు. కొంచెం ఎండ కాస్తోంది. మ్యాచ్‌కు మైదానాన్ని సిద్ధం చేసే ప‌నిలో సిబ్బంది నిమ‌గ్న‌మ‌య్యారు. మ్యాచ్ స‌మ‌యానికి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి.