Glenn Maxwell: తమిళమ్మాయితో పెళ్లికి రెడీ అయిన గ్లెన్ మ్యాక్స్‌వెల్

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తమిళమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. విని రామన్ అనే యువతితో మార్చి 27న వీరి వివాహం జరగనుంది. తమిళ భాషలో ప్రింట్..

Glenn Maxwell

Glenn Maxwell: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, ఆర్సీబీ స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ తమిళమ్మాయిని వివాహం చేసుకోనున్నాడు. విని రామన్ అనే యువతితో మార్చి 27న వీరి వివాహం జరగనుంది. తమిళ భాషలో ప్రింట్ అయిన వెడ్డింగ్ కార్డ్ సాక్షిగా సోషల్ మీడియాలో వీరి పెళ్లి ప్రచారం జరుగుతుంది.

నటి కస్తూరి శంకర్ వెడ్డింగ్ కార్డు షేర్ చేస్తూ.. ‘గ్లెన్ మ్యాక్స్‌వెల్, విని రామన్ తమిళ సంప్రదాయబద్ధంగా ఒకటి కానున్నారు. ఈ తరహా పెళ్లితో పాటు వైట్ గౌన్ వెడ్డింగ్ కూడా చూస్తామేమో’ అంటూ పోస్టు చేస్తూ గ్లెన్, వినీలకు కంగ్రాట్స్ తెలిపారు.

పెళ్లితో ఒకటి కానున్న ఈ జంట కొవిడ్ మహమ్మారి ప్రభావం కనిపించకముందే ఎంగేజ్మెంట్ పూర్తి చేసుకున్నారు. 2017నుంచి డేటింగ్ లో ఉండగా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ అవుతూనే ఉన్నాయి. మ్యాక్స్‌వెల్ కాబోయే భార్య అయిన ఈ తమిళ అమ్మాయి మెల్‌బౌర్న్ లో ఫార్మసిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు.

IPL 2022: వేలం తర్వాత బెంగళూరు జట్టు పూర్తి వివరాలివే

మార్చి 27న వీరి పెళ్లి జరగనుండగా.. మ్యాక్స్‌వెల్ కొన్ని మ్యాచ్ లు మిస్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా జట్టుతో కలిసి శ్రీలంకపై ఐదు మ్యాచ్ ల టీ20సిరీస్ ఆడుతున్నాడు.