Glenn Maxwell : మెగా వేలానికి ముందే.. ఆర్సీబీని అన్‌ఫాలో చేసిన మ్యాక్స్‌వెల్.. బెంగళూరుకు బైబై చెప్పినట్టేనా?

Glenn Maxwell : ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ జట్టును అన్‌ఫాలో చేసిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోంది.

Glenn Maxwell's telling Instagram act sparks RCB transfer rumour ( Image Source : Google )

Glenn Maxwell : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గవర్నింగ్ కౌన్సిల్ ప్రతి ఫ్రాంచైజీకి ఎంతమంది ప్లేయర్లను రిటైన్ చేసేందుకు అనుమతిస్తుందో ఇంకా ప్రకటించలేదు. 2025 టోర్నమెంట్ ఎడిషన్ కోసం రాబోయే మెగా వేలం కోసం ఫార్మాట్‌ను కూడా ప్రకటించలేదు. ఈ క్రమంలో అన్ని జట్లలో పెద్ద మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొన్ని ఫ్రాంచైజీలలో అవసరమైన ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుని మిగతా ప్లేయర్లను వేలానికి పంపేందుకు సిద్ధమవుతున్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి.

Read Also : MS Dhoni : ఈ కండిష‌న్‌కు బీసీసీఐ ఓకే అంటేనే.. ఐపీఎల్ 2025లో ధోని ఆడేది..?

ఆ ఊహాగానాలే నిజమైతే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్సీబీ జట్టును అన్‌ఫాలో చేసిన ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి నిష్క్రమించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆర్సీబీ ఫ్రాంచైజీ మ్యాక్స్ వెల్‌ను జట్టులో కొనసాగించేందుకు ఆసక్తి చూపడం లేదని సమాచారం.

ఈ క్రమంలోనే మ్యాక్స్‌వెల్ ఆర్సీబీని అన్‌ఫాలో చేసి ఉంటాడనే వార్త వైరల్ అవుతోంది. 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు మ్యాక్స్‌వెల్ వేలంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మాక్స్‌వెల్ ఆర్సీబీ శిబిరాన్ని విడిచిపెట్టనున్నాడనే ఊహాగానాల నేఫథ్యంలో అభిమానులు సోషల్ మీడియాలో ఆసీస్ ఫ్రాంచైజీని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిన స్క్రీన్‌షాట్‌లను షేర్ చేస్తున్నారు.

2021 సీజన్ వేలానికి ముందు రూ. 14.25 కోట్ల భారీ మొత్తానికి మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ జట్టులో చేరాడు. తాను ఆడిన 15 మ్యాచ్‌లలో 6 హాఫ్ సెంచరీలతో 513 పరుగులు చేశాడు. ఆ తరువాతి సీజన్‌లో ఆర్సీబీ మ్యాక్స్‌వెల్‌ను రూ. 11 కోట్లకు దక్కించుకుంది. 2022లో అతడి గ్రాఫ్ పడిపోయినా ఆడిన 13 గేమ్‌లలో హాఫ్ సెంచరీతో 301 పరుగులు సాధించాడు. 183.49 స్ట్రైక్ రేట్‌తో బెంగళూరు తరపున 14 మ్యాచ్‌లలో 400 పరుగులు సాధించాడు. 2024 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ చెత్త ప్రదర్శనతో ఘోరంగా విఫలమయ్యాడు.

ఆడిన 10 గేమ్‌లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. మిడిల్ ఆర్డర్ కీలకంగా ఉంటాడని భావిస్తే.. జట్టుకు భారంగా మారాడు. అయితే, 2025 ఐపీఎల్‌లో మెగా వేలం జరుగబోతోంది. ఈ మెగా వేలంలో ముగ్గురు నుంచి నలుగురు ప్లేయర్లను మాత్రమే ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆర్సీబీ రిటైన్ చేసే ఆటగాళ్ల జాబితాలో మ్యాక్‌వెల్ ఉండడనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే గానీ జరిగితే ఆసీస్ ఆటగాడు వేలంలోకి రానున్నాడు.

Read Also : Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో మ‌రో పత‌కం.. చరిత్ర సృష్టించిన మ‌ను భాక‌ర్‌..

ట్రెండింగ్ వార్తలు