Hardik Pandya : టీమ్ఇండియాకు శుభ‌వార్త‌.. అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యాకు లైన్‌క్లియ‌ర్!

భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఫిట్నెస్ టెస్టును క్లియర్ చేశాడు.

Good news to Team India Hardik Pandya clears fitness test

  • ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్యా
  • అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌కు లైన్ క్లియ‌ర్‌

Hardik Pandya : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు శుభ‌వార్త ఇది. భార‌త జ‌ట్టు స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్‌ను సాధించాడు. ఆదివారం అఫ్గానిస్థాన్‌తో జ‌ర‌గ‌నున్న వ‌న్డే సిరీస్‌కు అత‌డు అందుబాటులోకి వచ్చాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో అత‌డు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల‌ను పూర్తి చేశాడు. దీంతో అత‌డికి సీఓఈ అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడేందుకు అనుమ‌తి ఇచ్చింద‌ని స‌మాచారం.

అఫ్గానిస్థాన్‌తో వ‌న్డే సిరీస్‌కు ఎంపిక చేసిన భార‌త జ‌ట్టులో హార్దిక్ పాండ్యాకు చోటు ద‌క్కింది. అయితే.. అత‌డు ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ల్లో నెగ్గితేనే ఈ సిరీస్‌లో ఆడ‌తాడ‌ని, లేదంటే ఆడ‌డ‌ని జ‌ట్టును ప్ర‌క‌టించే సంద‌ర్భంలోనే చీఫ్ సెల‌క్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

Vaibhav Sooryavanshi : ఘోరంగా విఫ‌ల‌మైన వైభ‌వ్ సూర్య‌వంశీ.. 12 బంతులు ఆడి..

ఇటీవ‌ల ముగిసి ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో హార్దిక్ వెన్ను నొప్పితో బాధ‌ప‌డ్డాడు. ఈ క్ర‌మంలో ప‌లు మ్యాచ్‌ల‌కు సైతం దూరంగా ఉన్నాడు. ఈ ఐపీఎల్ ముగిసిన వెంట‌నే అత‌డు విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు. ఆ త‌రువాత బెంగ‌ళూరు వ‌చ్చిన హార్దిక్ గ‌త ఐదు రోజులుగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడు.

శిక్షణలో భాగంగా హార్దిక్ ఎటువంటి అసౌకర్యం లేకుండా మ్యాచ్ సిమ్యులేషన్స్ పూర్తి చేయడమే కాకుండా, తన పూర్తి కోటా అయిన 10 ఓవర్లను అలవోకగా బౌలింగ్ చేశాడు. అతని శారీరక దృఢత్వాన్ని పరిశీలించిన స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్‌లు అన్ని పారామీటర్లలో అతని డేటా సంతృప్తికరంగా ఉందని క్లియరెన్స్ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. చండీగఢ్‌లో జరిగే డే-నైట్ ప్రాక్టీస్ సెషన్‌లో జట్టుతో కలుస్తాడా లేక నేరుగా ధర్మశాల చేరుకుంటాడా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

Ben stokes : నైట్‌క్లబ్ గొడవ.. కెప్టెన్సీ కోల్పోయే ప్రమాదంలో బెన్‌స్టోక్స్‌? మ‌రో ఆట‌గాడిపై నిషేధం ప‌డ‌నుందా?

మ‌రోవైపు భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఉన్నాడు. కండ‌రాల గాయం కార‌ణంగా ఐపీఎల్ 2026లో హిట్‌మ్యాన్ ప‌లు మ్యాచ్ లు ఆడ‌లేదు. అఫ్గాన్‌తో వ‌న్డే సిరీస్‌లో ఆడాలంటే హిట్‌మ్యాన్ కూడా ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది.