GT vs RR IPL 2022 Qualifier 1 : ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్.. వర్షం పడితే.. ఫైనల్‌ చేరేదెట్టా..! ఏ జట్టుకు ఛాన్స్ ఎక్కువంటే?

GT vs RR IPL 2022 : ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. లీగ్‌ దశలో మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు జట్లు నిలిచాయి. అవే.. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు..

GT vs RR IPL 2022 : ఐపీఎల్‌ 2022 సీజన్‌ చివరి దశకు చేరుకుంది. లీగ్‌ దశలో మొదటి రెండు స్థానాల్లో ఈ రెండు జట్లు నిలిచాయి. అవే.. గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్లు.. ఈ రెండింటి మధ్య మంగళవారం (మే 24న) క్వాలిఫయర్‌-1 మ్యాచ్ జరగనుంది. కోల్‌కతా వేదికగా ఈ ప్లే ఆఫ్ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. దాంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన మ్యాచ్ లకు వరుణుడు అడ్డంకిగా మారడం కొత్తేమీ కాదు.. ప్రస్తుతం ప్లే ఆఫ్ మ్యాచ్ జరిగే కోల్ కతాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వాతావరణం మేఘావృతమై కనిపిస్తోంది. ఏ క్షణమైనా వర్షం పడేలా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాజ్ జరగడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈడెన్‌ గార్డెన్స్‌లో మ్యాచ్‌ జరగాల్సి ఉంది. ఇక్కడ ఆధునాతన డ్రైనేజీ సౌకర్యం కూడ ఉంది. ఒకవేళ మ్యాచ్‌ సమయంలో వర్షం వచ్చినా నీటిని బయటకు పంపేయొచ్చు. ఉరుములు, మెరుపులతో వర్షం పడితే మాత్రం మ్యాచ్ రద్దు కావడం తప్ప మరొ దారిలేదు. ప్రస్తుతం అయితే వాతావరణ పరిస్థితి బాగానే ఉంది. సాయంత్రానికి వర్షం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాచ్‌ ప్రారంభానికి రెండు గంటల పాటు భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అనుకున్నట్టుగా వర్షం పడితే.. అవుట్‌ ఫీల్డ్‌ చిత్తడిగా మారిపోతుంది.. ఫలితంగా మ్యాచ్‌ రద్దు అవుతుంది. అందులోనూ క్వాలిఫయర్‌-1కు రిజర్వ్‌డే కూడా లేదు. మ్యాచ్‌ రద్దు అయితే ఫైనల్‌ ఎవరు వెళ్తారు అనేది ఉత్కంఠగా మారింది. వర్షం కారణంగా ఒకవేళ ప్లే ఆఫ్ ఆటకు అంతరాయం కలిగితే మ్యాచ్‌ నిర్వహణ ఎలా? ఎవరికి ఫైనల్‌ ఛాన్స్ బలంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం.. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తే.. ఫైనల్‌కు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది.. ఇరుజట్ల మధ్య ఐదు ఓవర్ల మ్యాచ్‌ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారే ఫైనల్‌ చేరుకుంటారు. అదే ఓడిన జట్టు క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌‌లో మరో అవకాశం దక్కుతుంది. ఇక రెండో మార్గం.. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి చివరి దాకా వర్షం కురిస్తే మాత్రం.. అప్పటికీ మ్యాచ్‌కు ఛాన్స్ ఉంటే.. సూపర్‌ ఓవర్‌ ఆడిస్తారు. ఇందులో గెలిచిన జట్టునే విజేతగా నిర్ణయిస్తారు. భారీ వర్షం కారణంగా సూపర్‌ ఓవర్‌ కూడా ఆడించలేని పరిస్థితి ఎదురైతే.. లీగ్‌లో అత్యధిక విజయాలు సాధించిన గ్రూప్ టాపర్‌ జట్టు ఫైనల్‌ బెర్త్ దక్కించుకుంటుంది. ఇదే జరిగితే.. గుజరాత్‌ టైటాన్స్‌ ఫైనల్‌ చేరడం ఖాయమే.. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు క్వాలిఫయర్‌-2కు రెడీగా ఉండాల్సి ఉంటుంది.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం.. ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు ఇంటిబాట పట్టాల్సిందే మరి.. ఇందులోనూ సూపర్‌ ఓవర్‌ ఆడించలేని పరిస్థితి ఎదురైతే.. మూడో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరిన లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు క్వాలిఫయర్‌-2లో అర్హత సాధిస్తుంది.

తుది జట్లు (అంచనా)

రాజస్థాన్‌: శాంసన్‌ (కెప్టెన్‌), బట్లర్‌, జైస్వాల్‌, పడిక్కల్‌, హెట్‌మైర్‌, పరాగ్‌, అశ్విన్‌, బౌల్ట్‌, మెక్‌కాయ్‌, చాహల్‌, కుల్దీప్‌ సేన్‌.

గుజరాత్‌: హార్దిక్‌ (కెప్టెన్‌), గిల్‌, సాహా, వేడ్‌, మిల్లర్‌, తెవాటియా, రషీద్‌ ఖాన్‌, సాయి కిషోర్‌, షమీ, ఫెర్గూసన్‌, యష్‌ దయాల్‌.

Read Also : IPL 2022: లీగ్ దశలో టాప్ స్కోరర్లు వేరే

ట్రెండింగ్ వార్తలు