Gujarat Titans Bus Fire: గుజ‌రాత్ ప్లేయ‌ర్ల‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం.. హోట‌ల్‌కు వెలుతుండ‌గా బ‌స్సులో మంట‌లు..

Gujarat Titans Bus: ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)ఆటగాళ్ల‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది.

Gujarat Titans players and staff evacuated from team bus after short circuit

Gujarat Titans Bus: ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ ముగిసిన త‌రువాత గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్ల‌కు తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. వారు ప్ర‌యాణిస్తున్న బ‌స్సులో మంట‌లు చెల‌రేగాయి. ఆదివారం అర్థ‌రాత్రి ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్రమోదీ స్టేడియంలో ఐపీఎల్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌పడ్డాయి. ఆర్‌సీబీ విజేత‌గా నిలిచి రెండోసారి క‌ప్పును ముద్దాడింది. అదే స‌మ‌యంలో రెండో సారి క‌ప్పును కైవ‌సం చేసుకోవాల‌ని భావించిన శుభ్‌మ‌న్ గిల్ నేతృత్వంలోని గుజ‌రాత్ టైటాన్స్‌ను నిరాశే ఎదురైంది.

*Virat Kohli : నా క‌ల నెర‌వేరింది.. ఈ క్ష‌ణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా.. ఆ సిక్స్ కొట్టిన‌ప్పుడు.. కోహ్లీ కామెంట్స్‌..

మ్యాచ్ ముగిసిన త‌రువాత గుజ‌రాత్ ఆట‌గాళ్లు మైదానం నుంచి బ‌స్సులో హోట‌ల్‌లు వెలుతున్నారు. షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగా బ‌స్సులో పొగ‌లు వ‌చ్చాయి. వెంట‌నే బ‌స్సును నిలిపివేశారు. వెంట‌నే ఆట‌గాళ్లు, స‌హ‌య‌క సిబ్బంది బ‌స్సు నుంచి దిగిపోయారు. వారు దిగిన కొద్ది సేప‌టి త‌రువాత మంట‌లు రేగాయి. ఆట‌గాళ్లు కొద్ది సేపు వ‌ర‌కు రోడ్డుపైనే వేచి ఉన్నారు. ఆ త‌రువాత మ‌రో బ‌స్సులో హోట‌ల్‌కు వెళ్లిపోయారు. ఎవ‌రికి ఏమీ కాక‌పోవ‌డంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.