Gujarat Titans win
IPL 2023, GT vs MI: ఐపీఎల్ 2023లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగాముంబై ఇండియన్స్(Mumbai Indians) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) 55 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 152 పరుగులకే పరిమితమైంది. ముంబై బ్యాటర్లలో నేహాల్ వధేరా(40; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కామెరూన్ గ్రీన్(33; 26 బంతుల్లో 3 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(23; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పర్వాలేదనిపించగా మిగిలిన వారు దారుణంగా విఫలం అయ్యారు. గుజరాత్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ చెరో రెండు వికెట్లు, హార్దిక్ పాండ్య ఓ వికెట్ పడగొట్టాడు.
IPL 2023, GT vs MI: ముంబై పై గుజరాత్ ఘన విజయం
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(56; 34 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకాలతో ఆకట్టుకోగా డేవిడ్ మిల్లర్(46; 22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), అభినవ్ మనోహర్ (42; 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఆఖర్లో తెవాటియా (20 నాటౌట్; 5 బంతుల్లో 3 సిక్సర్లు) దంచికొట్టడంతో ముంబై ముందు భారీ లక్ష్యం నిలిచింది. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా, అర్జున్ టెండూల్కర్, రిలే మెరెడిత్, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయలు ఒక్కొ వికెట్ పడగొట్టాడు.
IPL 2023: గెలుపు మత్తులో ఉన్న వార్నర్‌కు భారీ షాక్