IPL 2023, LSG vs GT: చేజేతులా ఓడిపోయిన ల‌క్నో.. స్వల్ప ల‌క్ష్యాన్ని కాపాడుకున్న గుజ‌రాత్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. 136 ప‌రుగు ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Gujarat Titans

IPL 2023, LSG vs GT: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో గుజ‌రాత్ టైటాన్స్ విజ‌యం సాధించింది. 136 ప‌రుగుల‌ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ల‌క్నో జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 128 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో గుజ‌రాత్ 7 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

ల‌క్ష్య ఛేధ‌న‌లో ల‌క్నో జ‌ట్టుకు ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్‌(68; 61 బంతుల్లో 8 ఫోర్లు), కైల్ మేయ‌ర్స్‌(24; 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. వీరిద్ద‌రు పోటాపోటీగా బౌండ‌రీలు బాద‌డంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి ల‌క్నో 53/0 తో నిలిచింది. ప్ర‌మాద‌క‌రంగా మారిన వీరి జోడిని ర‌షీద్ ఖాన్ విడ‌గొట్టాడు. మేయ‌ర్స్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 55 ప‌రుగుల వ‌ద్ద ల‌క్నో తొలి వికెట్ కోల్పోయింది.

వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కృనాల్ పాండ్యా(23;  23 బంతుల్లో 2 ఫోర్లు, 1సిక్స్‌)తో రాహుల్ ఇన్నింగ్స్‌ను న‌డిపించాడు. ఈ క్ర‌మంలో 38 బంతుల్లో రాహుల్ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. 51 ప‌రుగులు జోడించిన త‌రువాత జ‌ట్టు స్కోరు 106 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ రూపంలో కృనాల్ పాండ్యా ఔట్ అయ్యాడు. అప్ప‌టికి ల‌క్నో స్కోరు106/2 (14.3ఓవ‌ర్లు). ఈ ద‌శ‌లో ల‌క్నో సునాయాస‌నంగా మ్యాచ్ గెలుస్తుంద‌ని బావించారు. అయితే.. గుజ‌రాత్ బౌల‌ర్లు విజృంభించ‌డంతో ప‌రుగుల వేగం మంద‌గించ‌డంతో పాటు వ‌రుస‌గా వికెట్లు కోల్పోయింది ల‌క్నో. క్రీజులో కుదురుకున్న‌ప్ప‌టికి కేఎల్ రాహుల్ వేగంగా ఆడలేక‌పోయాడు.

IPL 2023, LSG vs GT:ఉత్కంఠ పోరులో ల‌క్నోపై గుజ‌రాత్ విజ‌యం

దీంతో చివ‌రి ఓవ‌ర్‌లో ల‌క్నో విజ‌యానికి 12 ప‌రుగులు అవ‌స‌రం కాగా.. మోహిత్ శ‌ర్మ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. రెండో బంతికి రాహుల్‌ను. మూడో బంతికి స్టోయినిస్‌(0) ల‌ను ఔట్ చేశాడు. నాలుగో బంతికి బ‌దోని, ఐదో బంతికి దీప‌క్ హుడాలు ర‌నౌట్ అయ్యారు. చివ‌రి బంతికి ప‌రుగు కూడా రాలేదు. ఈ ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులే రావ‌డంతో గుజరాత్ 7 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్‌, మోహిత్ శ‌ర్మ చెరో రెండు వికెట్లు తీయ‌గా, ర‌షీద్ ఖాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 135 ప‌రుగులు చేసింది. గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో హార్థిక్ పాండ్యా(66; 50 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో అల‌రించ‌గా వృద్ధిమాన్ సాహా(47; 37 బంతుల్లో 6 ఫోర్లు) రాణించాడు. శుభ్‌మ‌న్ గిల్‌(0), విజ‌య్ శంక‌ర్‌(10), డేవిడ్ మిల్ల‌ర్‌(6) లు విఫ‌లం కావ‌డంతో ల‌క్నో ముందు ఓ మోస్తారు ల‌క్ష్యం నిలిచింది. ల‌క్న్ బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్య‌, స్టాయినిస్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, అమిత్ మిశ్రా, న‌వీన్ ఉల్ హ‌క్ ఒక్కొ వికెట్ తీశారు.

IPL 2023: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్ .. మరోవారం రోజులు జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ ..