Happy Birthday Virat Kohli: కింగ్ కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ.. ఎవరెవరు విషెష్ చెప్పారంటే.. ట్వీట్లు వైరల్
టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. రాజకీయ ప్రముఖులు, మాజీ, తాజా క్రికెటర్లు కోహ్లీకి ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
- Harish Thanniru
- Updated on- November 5, 2023 / 02:10 PM IST
Virat Kohli Birthday
Virat Kohli Birthday : టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 35వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్ లో ‘కింగ్ కోహ్లీ’ బ్యాట్ తో పరుగుల వరద పారియిస్తున్నాడు. విరాట్ ఈ వరల్డ్ కప్ లో ఏడు మ్యాచ్ లు ఆడగా.. 442 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ సెంచరీ చేయడం ద్వారా సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేయాలని క్రికెట్ అభిమానులు ఆశగా ఎదరు చూస్తున్నారు.
Also Read : IND vs SA : టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బ్యాటింగ్.. జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..?
విరాట్ ను పరుగుల రారాజు అని పిలుస్తుంటారు. తక్కువ సమయంలో దిగ్గజ క్రికెటర్ల రికార్డులను కోహ్లీ బద్దలు కొట్లాడు. కోహ్లీ వన్డేల్లో 13,525 పరుగులు, టెస్టుల్లో 8,676 పరుగులు, టీ20 ఫార్మాట్ లో 4,008 పరుగులు చేశాడు. ఐపీఎల్ లో 7,263 పరుగులు చేశాడు. కోహ్లీ 78 ఇంటర్నేషనల్ సెంచరీలు పూర్తి చేశాడు. ఐపీఎల్ లో ఏడు సెంచరీలు కొట్టాడు. కింగ్ కోహ్లీ35వ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాక రాజకీయ ప్రముఖులు, మాజీ, తాజా క్రికెటర్లు కోహ్లీకి ట్విటర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
