IND vs SA : టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs SA : టీమ్ఇండియా ఘ‌న విజ‌యం

IND vs SA

టీమ్ఇండియా ఘ‌న విజ‌యం.
327 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ద‌క్షిణాఫ్రికా 27.1 ఓవ‌ర్ల‌లో 83 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ 243 ప‌రుగుల భారీ తేడాతో విజ‌యం సాధించింది.

కేశవ్ మ‌హ‌రాజ్ క్లీన్ బౌల్డ్..
జ‌డేజా బౌలింగ్‌లో కేశవ్ మ‌హ‌రాజ్ (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 18.4వ ఓవ‌ర్‌లో 67 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

డేవిడ్ మిల్ల‌ర్ క్లీన్‌బౌల్డ్‌..
జ‌డేజా బౌలింగ్‌లో డేవిడ్ మిల్ల‌ర్ (11) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 16.3వ ఓవ‌ర్‌లో 59 ప‌రుగుల వ‌ద్ద ద‌క్షిణాఫ్రికా ఆరో వికెట్ కోల్పోయింది.

డ‌సెన్ ఔట్‌
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. ష‌మీ బౌలింగ్‌లో డ‌సెన్ (13) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 13.1వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

క్లాసెన్ ఔట్‌..
ద‌క్షిణాఫ్రికా మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో క్లాసెన్ (1) ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ అయ్యాడు. దీంతో 12.5వ ఓవ‌ర్‌లో 40 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

మార్‌క్ర‌మ్ ఔట్‌..
మ‌హ్మ‌ద్ ష‌మీ బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ (9) కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 9.5వ ఓవ‌ర్‌లో 35 ప‌రుగుల వ‌ద్ద ద‌క్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. 10 ఓవ‌ర్ల‌కు సౌతాఫ్రికా స్కోరు 35/3. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ (9), హెన్రిచ్ క్లాసెన్ (0) లు ఆడుతున్నారు.

బ‌వుమా క్లీన్‌బౌల్డ్
సౌతాఫ్రికా జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో బ‌వుమా (11) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 8.3వ ఓవ‌ర్‌లో సౌతాఫ్రికా 22 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది.

సూప‌ర్ ఫామ్‌లో ఉన్న డికాక్ క్లీన్‌బౌల్డ్‌..
భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన సౌతాఫ్రికాకు షాక్ త‌గిలింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సూప‌ర్ ఫామ్‌లో ఉన్న క్వింట‌న్ డికాక్ (5) మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ద‌క్షిణాఫ్రికా 1.4వ ఓవ‌ర్‌లో 6 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

ద‌క్షిణాఫ్రికా టార్గెట్ 327
స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ (101 నాటౌట్; 121 బంతుల్లో 10 ఫోర్లు) శ‌త‌క్కొట్టాడు. దీంతో టాస్ గెలిచి మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 326 ప‌రుగులు చేసింది. భార‌త బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కం చేశాడు. రోహిత్ శ‌ర్మ (40; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), ర‌వీంద్ర జ‌డేజా (29 నాటౌట్; 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో లుంగి ఎంగిడి, మార్కో జాన్సెన్‌, క‌గిసో ర‌బాడ‌, కేశ‌వ్ మ‌హ‌రాజ్‌, షమ్సీ లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

విరాట్ సెంచ‌రీ.. స‌చిన్ రికార్డు స‌మం
ర‌బాడ బౌలింగ్‌లో సింగిల్ తీసి 119 బంతుల్లో 10 ఫోర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేశాడు. వ‌న్డేల్లో ఇది విరాట్‌కు 49వ శ‌త‌కం. ఈ క్ర‌మంలో వ‌న్డేల్లో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన స‌చిన్ రికార్డును స‌మం చేశాడు.

సూర్య‌కుమార్ యాద‌వ్ ఔట్‌..
భార‌త్ మ‌రో వికెట్ కోల్పోయింది. షంసీ బౌలింగ్‌లో డికాక్ క్యాచ్ అందుకోవ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ (22) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 285 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

కేఎల్ రాహుల్ ఔట్‌..
మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో డ‌స్సెన్ క్యాచ్ అందుకోవ‌డంతో కేఎల్ రాహుల్ (8) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 42.1వ ఓవ‌ర్‌లో 249 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

శ్రేయ‌స్ అయ్య‌ర్ ఔట్‌
టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మార్‌క్ర‌మ్ క్యాచ్ అందుకోవ‌డంతో శ్రేయ‌స్ అయ్య‌ర్ (77; 87బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 36.5వ ఓవ‌ర్‌లో 227 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

35 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 219/2
శ్రేయ‌స్‌, విరాట్ కోహ్లీ ల మ‌ధ్య శ‌త‌క భాగ‌స్వామ్యం న‌మోదైంది. 35 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 219/2. శ్రేయ‌స్ అయ్య‌ర్ (70), విరాట్ కోహ్లీ (67) లు ఆడుతున్నారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీ
మార్కోజాన్సెన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి శ్రేయ‌స్ అయ్య‌ర్ 64 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో హాప్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. 31 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 193/2. విరాట్ కోహ్లీ (54), శ్రేయ‌స్ అయ్య‌ర్ (59) లు ఆడుతున్నారు.

బ‌ర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ
త‌న పుట్టిన రోజు నాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ చేశాడు. కేశ‌వ్‌మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 67 బంతుల్లో 5 ఫోర్ల‌తో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. వ‌న్డేల్లో విరాట్ కోహ్లీ ఇది 71వ అర్ద‌శ‌త‌కం. 29 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 170/2. కోహ్లీ (53), శ్రేయ‌స్ అయ్య‌ర్ (39) లు ఆడుతున్నారు.

15 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 105/2
భార‌త బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. భార‌త స్కోరు వంద ప‌రుగులు దాటింది. 15 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 105/2. విరాట్ కోహ్లీ (24), శ్రేయ‌స్ అయ్య‌ర్ (7) లు ఆడుతున్నారు.

గిల్ క్లీన్‌బౌల్డ్‌.. 
కేశవ్ మ‌హ‌రాజ్ బౌలింగ్‌లో శుభ్‌మ‌న్ గిల్ (23; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భార‌త్ 10.3వ ఓవ‌ర్‌లో 93 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 11 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 94/2. విరాట్ కోహ్లీ(19), శ్రేయ‌స్ అయ్య‌ర్ (1) లు ఆడుతున్నారు.

రోహిత్ శ‌ర్మ ఔట్‌..
భార‌త్‌కు షాక్ త‌గిలింది. ర‌బాడ బౌలింగ్‌లో రోహిత్ శ‌ర్మ‌(40; 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) బ‌వుమా క్యాచ్ అందుకోవ‌డంతో ఔట్ అయ్యాడు. దీంతో 5.5వ ఓవ‌ర్ లో 62 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

4 ఓవ‌ర్లకు భార‌త స్కోరు 45/0
భార‌త ఓపెన‌ర్లు దూకుడుగా ఆడుతున్నారు. 4 ఓవ‌ర్లు ముగిసే సరికి భార‌త స్కోరు 45/0. రోహిత్ శ‌ర్మ (24), శుభ్‌మ‌న్ గిల్ (12) లు ఆడుతున్నారు.

దక్షిణాఫ్రికా తుది జ‌ట్టు : క్వింటన్ డి కాక్(వికెట్ కీప‌ర్‌), టెంబా బావుమా(కెప్టెన్‌), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబడ, లుంగీ న్గిడి

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

భార‌త్ బ్యాటింగ్‌..
టాస్ గెలిచిన టీమ్ఇండియా.. బ్యాటింగ్.. జ‌ట్టులో ఎవ‌రెవ‌రు ఉన్నారంటే..?

India vs South Africa : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆస‌క్తిక‌ర పోరుకు రంగం సిద్ధ‌మైంది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా భార‌త్ కొన‌సాగుతోంది. అటు ద‌క్షిణాఫ్రికా సైతం నెద‌ర్లాండ్స్ చేతిలో అనూహ్య ఓట‌మి మిన‌హా మిగిలిన అన్ని మ్యాచుల్లో గెలిచింది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య పోరు హోరా హోరీగా సాగ‌నుంది. భార‌త విజ‌యాల‌కు ద‌క్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా..? లేదంటే త‌ల‌వొంచుతుందా అన్న‌ది ఆస‌క్తి రేకెత్తిస్తోంది.