IND vs BAN T20 Match: హైద‌రాబాద్‌లో మ్యాచ్ తరువాత సూర్యకుమార్, గంభీర్ గురించి హార్దిక్ పాండ్య కీలక వ్యాఖ్యలు

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

Hardik Pandya

Hardik Pandya: బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను భారత్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. మూడో మ్యాచ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత ఓవర్లలో 297 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు కేవలం 164 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 133 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సిరీస్ లో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.

Also Read: sanju samson: ఒకే ఓవర్లో వరుసగా ఐదు సిక్సులు కొట్టిన సంజూ శాంసన్ .. వీడియో వైరల్

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ స్వేచ్ఛ ఇచ్చారు. ఇందుకు వారిద్దరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. నా పెర్‌ఫార్మెన్స్‌లో వారిద్దరిది చాలా ప్రత్యేకమైన సహకారం. జట్టు మొత్తానికి స్వేచ్ఛ నిచ్చిన కెప్టెన్, కోచ్ అద్భుతమని హార్దిక్ కొనియాడారు. ఇది ఒక గేమ్. దీనిలో ఆస్వాదిస్తూ ఆడితే ఫలితం కూడా అనుకూలంగా వస్తుంది. అప్పుడే ఆటగాడిలోని వంద శాతం ప్రతిభ బయట పడుతుందని హార్దిక్ అన్నారు. నేనెప్పుడూ ఒకేలా ఉంటా.. పెద్దగా మార్పులు ఉండవు. కానీ, మనదికాని రోజున ఎంత చేసినా కలిసిరాదు. బంగ్లాతో చివరి ఓవర్ లో కవర్స్ మీదుగా ఆడిన షాట్లు తరచూ కట్టలేం. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటేనే అలాంటి షాట్లు వస్తాయని హార్ది అన్నారు.

Also Read: IND vs BAN : భారత్ దెబ్బకు బంగ్లాదేశ్ చిత్తు.. టీ20 సిరీస్ క్లీన్‌స్వీప్..!

మూడు మ్యాచ్ ల సిరీస్ లో హార్దిక్ పాండ్య ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చారు. మూడు మ్యాచ్ లలో బ్యాటింగ్ లో మొత్తం 118 పరుగులు చేసిన పాండ్య, బౌలింగ్ లో ఒక వికెట్ తీశాడు. ఫీల్డర్ గానూ ఐదు క్యాచ్ లు అందుకున్నాడు. దీంతో భారత్, బంగ్లాదేశ్ టీ20 సిరీస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా హార్దిక్ ఎంపికయ్యాడు.