Harsha Bhogle : వైభ‌వ్‌కు వైస్‌కెప్టెన్సీ.. హ‌ర్షా బోగ్లే కామెంట్స్ వైర‌ల్‌.. అలా ఎలా చేశారు?

రెడ్ బాల్ ఫార్మాట్‌లో వైభ‌వ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని, అత‌డికి వైస్ కెప్టెన్సీ అప్ప‌గించ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యేన‌ని ప్ర‌ముఖ వ్యాఖ్యాత హ‌ర్షా భోగ్లే (Harsha Bhogle) అన్నాడు.

Harsha Bhogle Million Dollar Post As Vaibhav Sooryavanshi Gets Vice Captaincy

Harsha Bhogle : ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబ‌ర్ 10 వ‌ర‌కు దులీప్ ట్రోఫీ 2026-27 సీజ‌న్ జ‌ర‌గ‌నుంది. ఈ సీజ‌న్ కోసం ఈస్ట్ జోన్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌కి బాధ్య‌త‌ల‌ను టీమ్ఇండియా న‌యా సంచ‌ల‌నం, 15 ఏళ్ల వైభ‌వ్ సూర్య‌వంశీకి అప్ప‌గించారు. ఇషాన్ కిష‌న్‌ను సార‌థిగా ఎంపిక చేశారు. కాగా.. ఇప్పుడిప్పుడే అంత‌ర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించిన వైభ‌వ్ సూర్య‌వంశీని వైస్ కెప్టెన్‌ను చేయ‌డంపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. కొంద‌రు ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తుండ‌గా, మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు.

రెడ్ బాల్ ఫార్మాట్‌లో వైభ‌వ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంద‌ని, అత‌డికి వైస్ కెప్టెన్సీ అప్ప‌గించ‌డం తొంద‌ర‌పాటు చ‌ర్యేన‌ని ప్ర‌ముఖ వ్యాఖ్యాత హ‌ర్షా భోగ్లే అన్నాడు. రెడ్ బాల్ క్రికెట్‌లో, అది కూడా సీనియ‌ర్లు ఉండే జ‌ట్టుకు వైస్ కెప్టెన్‌గా వైభ‌వ్ సూర్య‌వంశీని నియ‌మించ‌డం వెనుక సెల‌క్ట‌ర్ల ఆంత‌ర్యం ఏమిటో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌న్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో 12 ఇన్నింగ్స్‌లు మాత్ర‌మే ఆడాడ‌ని, 17.25 స‌గ‌టుతో 207 ప‌రుగులు చేశాడ‌ని చెప్పుకొచ్చాడు. తాను అత‌డి టాలెంట్‌ను త‌క్కువ చేయ‌డం లేద‌న్నాడు. అత‌డికి అద్భుత‌మైన నైపుణ్యం ఉంద‌న్నాడు. అయితే.. అత‌డు నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ‌ని హ‌ర్షా చెప్పాడు.

WI vs PAK : ఓట‌మి బాధ‌లో ఉన్న పాకిస్థాన్‌కు భారీ షాక్‌.. ఇంక అంతే..

కాగా.. వైభ‌వ్ సూర్య‌వంశీ, సీనియ‌ర్ బ్యాట‌ర్ అభిమన్యు ఈశ్వరన్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవ‌కాశం ఉంది. ఈ జట్టులో అనుభవజ్ఞులైన భారత పేసర్లు మహమ్మద్ షమీ, ముఖేష్ కుమార్ లు ఉన్నారు.

ఈస్ట్ జోన్ జట్టు ఇదే..

ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ కుమార్ ఘరామి, షాహ్‌బాజ్ అహ్మద్, సూరజ్ సింధు జైస్వాల్, మహ్మద్ షమీ, ముఖేష్ కుమార్, కుమార్ కుషాగ్రా, శిఖర్ మోహన్, అనుకుల్ రాయ్, విరాట్ సింగ్, సుభ్రాంశు సేనాపతి, దేనిష్ దాస్, అభిజిత్ సర్కార్.