Heinrich Klaasen : చ‌రిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ప్ర‌పంచ టీ20 క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen ) అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Heinrich Klaasen creates history Most runs in T20 tournament batting at No4 or lower (pic credit@ipl)

  • చ‌రిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెస్
  • ఐపీఎల్ 2026లో 600 ప‌రుగులు
  • ఓ టీ20 టోర్నీలో 4 లేదా అంత‌కంటే దిగువ‌న బ్యాటింగ్ చేస్తూ అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా

Heinrich Klaasen : దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆట‌గాడు హెన్రిచ్ క్లాసెన్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో 600 ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. శుక్ర‌వారం ఉప్ప‌ల్ వేదిక‌గా ఆర్‌సీబీతో జ‌రిగిన మ్యాచ్‌లో 51 ప‌రుగులు చేయ‌డం ద్వారా ఈ మైలురాయిని అందుకున్నాడు. ఈ నేప‌థ్యంలో ఓ టీ20 టోర్నమెంట్‌లో 4వ స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్ చేస్తూ 600కి పైగా పరుగులు చేసిన తొలి క్రికెట‌ర్‌గా క్లాసెన్ చ‌రిత్ర సృష్టించాడు.

ఆర్‌సీబీ మ్యాచ్‌కు ముందు అతను 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 ఇన్నింగ్స్‌లలో 555 పరుగులు సాధించాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4వ స్థానంలో ఆడిన క్లాసెన్ కేవలం 24 బంతుల్లోనే మెరుపు వేగంతో 51 పరుగులు చేసి ఈ టోర్నమెంట్‌లో 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు.

Travis Head vs Virat Kohli : హెడ్‌తో గొడ‌వ‌..! షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని విరాట్ కోహ్లీ.. వీడియో వైర‌ల్..

ఈ క్ర‌మంలోనే రిష‌బ్ పంత్‌ను అదిగ‌మించాడు. ఐపీఎల్ 2018లో పంత్ 11 ఇన్నింగ్స్‌లలో 579 పరుగులు చేశాడు. ఈ ప‌రుగులు నాలుగు లేదా నాలుగు కంటే దిగువ‌న స్థానాల్లో బ్యాటింగ్ చేస్తూ సాధించాడు.

ఓ టీ20 టోర్నమెంట్‌లో 4వ స్థానం లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* హెన్రిచ్ క్లాసెన్ – IPL 2026లో 606 పరుగులు
* రిషబ్ పంత్ – ఐపీఎల్ 2018లో 579 పరుగులు
* రియాన్ పరాగ్ – IPL 2024లో 573 పరుగులు
* సామ్ హైన్ – వైటాలిటీ బ్లాస్ట్ 2024లో 569 పరుగులు
* ఆడమ్ హోస్ – వైటాలిటీ బ్లాస్ట్ 2022లో 557 పరుగులు