విశాఖలో హై అలర్ట్…టీమిండియా,సౌతాఫ్రికా ఆటగాళ్లకు భద్రత పెంపు

విశాఖ వేదికగా ఐదో రోజు టెస్ట్ మ్యాచ్ లో  టీమిండియా,సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అయితే రప్రాంత నగరాలకు ఉగ్రముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించడంతో విశాఖలో హైఅలర్ట్ కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు. విశాఖలో సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా. టీమిండియా,సౌతాఫ్రికా క్రికెటర్లకు భద్రత పెంచారు. స్టేడియంలో అదనపు భద్రతను ఉంచారు.

900మంది పోలీసులు పహారా కాస్తున్నారు. నేవీ,మెరైన్ అధికాలతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని,.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు విశాఖ సీపీ ఆర్కె మీనా తెలిపారు.