RCB Prize Money : 20 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్‌సీబీ ఆటగాళ్లు ఎలా పంచుకుంటారు? భువనేశ్వర్ కుమార్ ఏమన్నాడంటే..?
RCB Prize Money: ఐపీఎల్ 2026 విజేతగా నిలవడంతో ఆర్‌సీబీకి (RCB) 20 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.
- Thota Vamshi Kumar
- Updated on- June 2, 2026 / 03:26 PM IST
How Will Divide 20 Crore IPL Prize Money Bhuvneshwar Kumar Gets Asked By MrNags
- ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్‌సీబీ
- ప్రైజ్‌మనీగా 20 కోట్లు
RCB Prize Money: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. విజేతగా నిలిచినందుకు ప్రైజ్‌మనీ కింద ఆర్‌సీబీకి 20 కోట్ల మొత్తం లభించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు ఎలా పంచుకుంటారు అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి ఉంది. ఇక ఇదే విషయాన్ని మిస్టర్ నాగ్స్ ఆర్‌సీబీ ఆటగాడు భువనేశ్వర్ కుమార్‌ను అడిగాడు.
17 సీజన్ల పాటు కప్పు కోసం నిరీక్షించిన ఆర్‌సీబీ ఎట్టకేలకు 18వ సీజన్‌లో విజేతగా నిలిచింది. అదే ఉత్సాహంలో 19వ సీజన్‌లోనూ కప్పును ముద్దాడింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తరువాత వరుసగా రెండు సార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన తరువాత మైదానంలో ఆర్‌సీబీ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సమయంలోనే ఆర్‌సీబీ డిజిటల్ హోస్ట్ మిస్టర్ నాగ్స్ మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. పలువురు ఆటగాళ్లను ఇంటర్వ్యూలు చేశాడు.
Mr Nags is suffering from success 😎
Post match presentation party gatecrashed! Mr. Nags was our toughest challenge of the season, even on the night of the final. Find out what happened, when he spoke to some special guests. 😭😂 pic.twitter.com/ebnwXvWt0G
— Royal Challengers Bengaluru (@RCBTweets) June 1, 2026
ఇక భువనేశ్వర్ కుమార్ దగ్గరకు వచ్చే సరికి మాత్రం 20 కోట్ల ప్రైజ్‌మనీని ఆటగాళ్లు ఎలా పంచుకుంటారని మిస్టర్ నాగ్స్ అడిగాడు. ఇందుకు భువీ ఎంతో తెలివిగా సమాధానం ఇచ్చాడు. నగదును ఎలా పంచుకుంటారు అనే విషయం తనకు తెలియదని, దాని గురించి తెలుసుకోవడానికి తనకు ఎంతో ఆసక్తిగా ఉందని సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎలాంటి వివాదంలో ఇరుక్కోకుండా భువీ చాలా చక్కగా చెప్పాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
