ఉప్పల్ మ్యాచ్.. వేల కొద్ది టికెట్లు నిమిషాల్లోనే మాయం.. ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్ దందా నడుస్తోందా?

IPL 2024: స్టేడియం కెపాసిటీ 39 వేలు. అందులో 80 శాతం టికెట్లు అమ్మాలి. మిగతా 20 శాతం స్పాన్సర్లు..

ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగడమే అరుదు. ఐపీఎల్‌ పుణ్యాన మ్యాచ్‌లు జరుగుతున్నాయి. మన సిటీలో లైవ్‌ మ్యాచ్‌ను చూడొచ్చని ఆశపడుతున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురవుతోంది. ఆన్‌లైన్‌లో టికెట్లు పెడతారు కానీ బుక్‌ కావట్లేదు. సేల్స్ ఓపెన్‌ అయిన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. తక్కువ ధర ఉండే 1500, 2500, 4500, 6000 వేల రూపాయల టికెట్లు సైట్‌లో ఎంతవెతికినా కనపడవు. కేవలం 15వేలు, 22 వేలు, 30వేల రూపాయల టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఇప్పటికే ఉప్పల్‌లో జరిగిన SRH వర్సెస్ ముంబై, SRH వర్సెస్ CSK మ్యాచ్ టికెట్స్ దొరకలేదని ఫ్యాన్స్ ఆగ్రహంతో ఉన్నారు. ఈనెల 25న RCBతో జరగబోయే మ్యాచ్‌కి అయినా టికెట్ బుక్ చేసుకుందామనుకున్న ఫ్యాన్స్‌కు మళ్లీ నిరాశ తప్పలేదు. పేటీఎంలో సేల్స్‌ స్టార్ట్ చేసిన ఐదు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అని కనిపించింది. 55 నిమిషాల వెయిటింగ్ టైమ్ పెట్టిన పేటీఎం సైట్.. ఆ తర్వాత సోల్డ్ ఔట్ అని దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ అసహనానికి గురయ్యారు. కొందరికి టికెట్స్ బుక్ అయినా..పేమెంట్ ఆప్షన్ వచ్చేసరికి ఎర్రర్ అని చూపించింది.

కనీసం 30 వేల టికెట్లు అయినా..
స్టేడియం కెపాసిటీ 39 వేలు. అందులో 80 శాతం టికెట్లు అమ్మాలి. మిగతా 20 శాతం స్పాన్సర్లు, HCA, క్రికెట్‌ క్లబ్స్‌, క్రికెటర్ల కోటాలో కాంప్లిమెంటరీ కింద ఉంటాయి. అంటే కనీసం 30 వేల టికెట్లు అయినా అమ్మాలి. కానీ టిక్కెట్లన్నీ ఐదు నిమిషాల్లోనే సోల్డ్ ఔట్ అని పెట్టడంతో టికెట్ల వెనక పెద్ద బ్లాక్‌ దందానే నడుస్తుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

స్టేడియం కెపాసిటీ ఎంత..? ఎన్ని టికెట్లు అమ్మకానికి పెడుతున్నారు..? ఎన్ని టికెట్లు కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు..? పేటీఎం పారదర్శకంగా టికెట్లు అమ్ముతుందా లేదా..? అని పట్టించుకునే వారే లేరు. HCAని అడిగితే తమకేం తెలియదు..టికెట్స్ సేల్స్ వ్యవహారం అంతా సన్ రైజర్స్ మేనేజ్మెంట్ చూసుకుంటుందని చేతులెత్తేస్తున్నారు. సన్ రైజర్స్ మేనేజ్మెంట్‌ని అడిగితే టికెట్స్ అన్నీ ఆన్‌లైన్‌లో పెడుతున్నామంటున్నారు. ఎట్లీస్ట్ పోలీసులు అయినా ఈ అంశంలో ఇంటర్ ఫియర్ అవుతారా అని అడిగితే తమకేం సంబంధం లేదని ఈజీగా చెప్పేస్తున్నారు.

ఇక స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నవారు టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడుతున్నారు. అయినా టికెట్స్ బ్లాక్ దందా ఆగడం లేదంటున్నారు ఫ్యాన్స్. సాధారణ ఫ్యాన్స్‌కు టికెట్లు దొరికేలా చూడాలని కోరుతున్నారు.

 Also Read: రికార్డు.. 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టిన నేపాల్ బ్యాటర్ దీపేంద్ర సింగ్.. వీడియో చూస్తారా?

ట్రెండింగ్ వార్తలు