Sindhu In Tokyo Olympics : గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా ? పీవీ సింధుకు అనుకూలమైన డ్రా

భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్‌లో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె గ్రూప్‌-జే నుంచి బరిలోకి దిగనుంది. దీంతో ఆమె విజయాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Gold Sindhu

PV Sindhu : భారత స్టార్‌ షట్లర్‌, ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుకు టోక్యో ఒలింపిక్స్‌లో అనుకూలమైన డ్రా లభించింది. మహిళల సింగిల్స్‌లో ఆమె గ్రూప్‌-జే నుంచి బరిలోకి దిగనుంది. దీంతో ఆమె విజయాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వర్ణ పతకం తేవడం ఖాయమేనా అనే చర్చ కొనసాగుతోంది. 34 వ ర్యాంకులో ఉన్న హాంకాంగ్‌ క్రీడాకారిణి చెంగ్‌ ఎంగన్‌ యి, 58వ ర్యాంకులో ఉన్న ఇజ్రాయెల్‌ అమ్మాయి సెనియా పొలికర్పోవాతో తలపడనుంది.

Read More : PM Modi : మంత్రివర్గంలో 33 మందిపై క్రిమినల్ కేసులు

డ్రా సులభంగానే ఉన్నా అత్యుత్తమంగా ఆడితేనే గెలుపు సాధ్యమని సింధు తెలిపింది. గ్రూప్‌ దశలో తనకు మంచి డ్రా ఎదురైందన్నారు పీవీ సింధు. హాంకాంగ్‌ అమ్మాయి బాగా ఆడుతోందని… మ్యాచ్‌ కఠినంగా జరగనుందన్నారు. ఒలింపిక్స్‌లో అంతా మంచి ఫామ్‌లో ఉంటారని…. తాను కూడా బాగానే ఆడతానని ధీమా వ్యక్తం చేశారు సింధు. ప్రతి మ్యాచ్ కీలకమే అన్నారు. ఒక్కో పోరు లక్ష్యంగా బరిలోకి దిగుతానని… ఒలింపిక్స్‌లో ప్రతి పాయింటు విలువైందే అని సింధు తెలిపింది.

Read More : TDP : టీటీడీపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..నేతలతో బాబు మీటింగ్

2016 రియో ఒలింపిక్స్‌లో రజతంతో మెరిసిన తెలుగు తేజం… ఈ సారి టోక్యోలో మాత్రం కచ్చితంగా స్వర్ణం సాధిస్తుందనే అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే సింధు సన్నద్ధమవుతున్నారు. స్వర్ణం సాధించడం అంత సులువేమీ కాదని… కానీ తన లక్ష్యం మాత్రం అదే అని సింధు స్పష్టం చేశారు. ఇప్పటికే నిరంతర ప్రాక్టీస్‌ కొనసాగుతోందని… మార్చి నుంచి ఎలాంటి టోర్నీలు లేకపోవడంతో ఆటను మరింత మెరుగుపరుచుకునే అవకాశం లభించినట్లు సింధు వెల్లడించింది. ఈ నెల 14 లేదా 17న టోక్యోకు సింధు బయల్దేరే అవకాశముంది.