×
Ad

T20 World Cup 2026 : భార‌త్, ఇంగ్లాండ్ సెమీస్ మ్యాచ్‌కు అంపైర్లు వీరే..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో (T20 World Cup 2026) సెమీఫైన‌ల్ మ్యాచ్‌ల‌కు ఐసీసీ అంపైర్లు, అధికారుల జాబితాను ప్ర‌క‌టించింది.

ICC announced match officials for T20 World Cup 2026 semi finals

  • మార్చి 4 నుంచి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లు
  • అంపైర్లు, అధికారుల‌ను ప్ర‌క‌టించిన ఐసీసీ

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026లో నాకౌట్ ద‌శ‌కు రంగం సిద్ధ‌మైంది. భార‌త్, ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఇంగ్లాండ్ లు సెమీస్‌కు చేరుకున్నాయి. బుధ‌వారం (మార్చి 4న‌) మొద‌టి సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా, న్యూజిలాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. ఇక గురువారం (మార్చి 5న‌) జ‌ర‌గ‌నున్న రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ మ్యాచ్‌కు ముంబైలోని వాంఖ‌డే మైదానం ఆతిథ్యం ఇవ్వ‌నుంది.

ఈ రెండు కీల‌క మ్యాచ్‌ల‌కు సంబంధించిన అంపైర్లు, మ్యాచ్ అధికారుల ప్యానెల్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్ర‌క‌టించింది.

PV Sindhu : సుర‌క్షితంగా బెంగ‌ళూరు చేరుకున్న పీవీ సింధు.. విశ్రాంతి తీసుకుంటా.. రీ సెట్ అయ్యాక..

కివీస్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగే తొలి సెమీఫైన‌ల్ మ్యాచ్‌కు రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్ లు ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. నితిన్ మీనన్ థ‌ర్డ్‌ అంపైర్‌గా, రాడ్ టక్కర్ ఫోర్త్‌ అంపైర్‌గా, జవగల్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

వాంఖ‌డేలో భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న రెండో సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు. ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్ థ‌ర్డ్ అంపైర్‌గా, పాల్ రీఫెల్ ఫోర్త‌ అంపైర్‌, ఆండీ పైక్రాఫ్ట్ మ్యాచ్ రిఫరీగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

Shahid Afridi : ఆఖ‌రి ఓవ‌ర్ ఎలా వేయాలో తెలియ‌దా.. అల్లుడి పై షాహిద్ అఫ్రిది ఫైర్‌.. నువ్వు అస‌లు..

తొలి సెమీఫైన‌ల్ ద‌క్షిణాఫ్రికా వ‌ర్సెస్ న్యూజిలాండ్‌కు మ్యాచ్ అధికారులు వీరే..

ఆన్-ఫీల్డ్ అంపైర్లు : రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, అలెక్స్ వార్ఫ్
థ‌ర్డ్ అంపైర్ : నితిన్ మీనన్
ఫోర్త్ అంపైర్ : రాడ్ టక్కర్
మ్యాచ్ రిఫరీ : జవగళ్ శ్రీనాథ్

రెండో సెమీఫైన‌ల్ భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అధికారులు వీరే..

ఆన్-ఫీల్డ్ అంపైర్లు : క్రిస్ గఫానీ, అల్లాహుద్దీన్ పాలేకర్
థ‌ర్డ్‌ అంపైర్ : ఆడ్రియన్ హోల్డ్‌స్టాక్
ఫోర్త్‌ అంపైర్ : పాల్ రీఫెల్
మ్యాచ్ రిఫరీ : ఆండీ పైక్రాఫ్ట్