ICC World Cup 2023 Schedule: వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది.. అక్టోబర్ 8న తొలి మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు..

ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ మంగళవారం అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది.

ICC World Cup 2023 Schedule

ICC World Cup 2023 : ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ మంగళవారం అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశలో భారత జట్టు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడుతుంది. భారత్ జట్టు తన తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆడుతుంది. చెన్నై వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో భారత్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ప్రపంచ క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. నవంబర్ 15, 16 తేదీల్లో ముంబయి, కోల్‌కతా వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ 19న అహ్మదాబాద్ వేదికగా జరుగుతుంది. అయితే, హైదరాబాద్, వైజాగ్ మినహా అన్ని ప్రధాన నగరాల్లో ఇండియా మ్యాచ్ లు ఆడుతుంది.

ఉప్పల్‌లో మూడు మ్యాచ్‌లు ..  రెండు మ్యాచ్‌లు ఆడనున్న పాక్. 

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్‌లో మొత్తం పది జట్లు పాల్గోనుండగా..46 రోజుల పాటు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. మొత్తం మ్యాచ్ లు ఇండియాలోని 12 స్టేడియాల్లో జరగనున్నాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలోని స్టేడియాల్లో మ్యాచ్ లు జరుగుతాయి. గౌహతి, తిరువనంతపురంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి.  అయితే, ఉప్పల్ స్టేడియంలో అక్టోబర్ 6, 9, 12 తేదీల్లో మూడు మ్యాచ్ లు జరుగుతాయి.  అక్టోబర్ 6న (శుక్రవారం) పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్-1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అదేవిధంగా అక్టోబర్ 9 (సోమవారం) న్యూజిలాండ్ వర్సెస్ క్వాలిఫయర్ -1 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్టోబర్ 12 ( గురువారం) పాకిస్థాన్ వర్సెస్ క్వాలిఫయర్ -2 జట్టు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఉప్పల్ స్టేడియంలో జరిగే మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు పాకిస్థాన్ ఆడేవే కావటం గమనార్హం.

 

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023.. ఇండియా మ్యాచ్‌లు

అక్టోబర్‌ 8: భారత్‌ vs ఆస్టేలియా (చెన్నై)
అక్టోబర్‌ 11: భారత్‌ vs అఫ్గానిస్తాన్‌ (ఢిల్లీ)
అక్టోబర్‌ 15: భారత్‌ vs పాకిస్తాన్‌ (అహ్మదాబాద్)
అక్టోబర్‌ 19: భారత్‌ vs బంగ్లాదేశ్‌(పుణే)
అక్టోబర్‌ 22: భారత్‌ vs న్యూజిలాండ్‌ (ధర్మశాల)
అక్టోబర్‌ 29: భారత్‌ vs ఇంగ్లండ్‌ (లక్నో)
నవంబర్‌ 2: భారత్‌ vs క్వాలిఫయర్‌2 (ముంబై)
నవంబర్‌ 5: భారత్‌ vs సౌతాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్ ‌11: భారత్‌ vs క్వాలిఫయర్-1 (బెంగళూరు)

నాకౌట్ మ్యాచ్‌ల షెడ్యూల్
నవంబర్ ‌15: సెమీఫైనల్-1 (ముంబై)
నవంబర్ ‌16: సెమీఫైనల్-2 (కోల్‌కతా)
నవంబర్ ‌19: ఫైనల్ (అహ్మదాబాద్)

ఎనిమిది జట్టు ఇప్పటికే క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ లీగ్ ద్వారా అర్హత సాధించాయి. జింబాబ్వేలో జూలై 9న ముగిసే క్వాలిఫయర్ టోర్నమెంట్ ముగింపులో చివరి రెండు స్థానాలు నిర్ణయించబడతాయి.

వన్డే వరల్డ్ కప్‌లో మ్యాచ్‌ల షెడ్యూల్

ICC World Cup 2023 Schedule

ట్రెండింగ్ వార్తలు