ICC Tournaments: ఐసీసీ పదేళ్ల ప్లానింగ్.. మూడు సార్లు భారత్‌ వేదికలపైనే

మెగా సంబరం టీ-20 వరల్డ్ కప్ 2021 ముగిసింది. టోర్నీ ముగిసిన రెండ్రోజులకే వచ్చే దశాబ్దానికి షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. వేదికలుగా 8 దేశాలను ఎంపిక చేసింది. భారత్ కు అత్యధికంగా మూడు

ICC Tournaments: మెగా సంబరం టీ-20 వరల్డ్ కప్ 2021 ముగిసింది. టోర్నీ ముగిసిన రెండ్రోజులకే వచ్చే దశాబ్దానికి షెడ్యూల్ విడుదల చేసింది ఐసీసీ. వేదికలుగా 8 దేశాలను ఎంపిక చేసింది. భారత్ కు అత్యధికంగా మూడు సార్లు ఐసీసీ టోర్నీ నిర్వహించే అవకాశమిస్తూ పెద్ద పీట వేసింది ఐసీసీ. పాకిస్థాన్ లో 1996లో వరల్డ్ కప్ జరిగిన తర్వాత మరో సారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించే అవకాశం ఇచ్చింది.

29 ఏళ్ల తర్వాత పాక్ గడ్డపై జరగనుండటంతో పాటు మరో ఆసక్తికరమైన విషయం.. అమెరికా కూడా వరల్డ్ కప్‌కు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కించుకుంది. 2024లో పురుషుల టీ20 వరల్డ్ కప్ ఆమెరికా వేదికగా జరగనుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాల క్రికెట్ బోర్డులు సంయుక్తంగా నిర్వహించనుండటం విశేషం.

2026లో భారత్, శ్రీలంక దేశాల్లో టీ20 వరల్డ్ కప్ జరగనుంది. 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో పాటు నమీబియాలోనూ వన్డే ప్రపంచకప్ పోటీలు జరగనున్నాయి. 2028 టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆతిథ్యమివ్వనున్నాయి. 2029లో ఛాంపియన్స్ ట్రోఫీ భారత్‌లో జరగనుండగా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ దేశాలకు 2030లో టీ20 వరల్డ్ కప్ నిర్వహించే అవకాశం దక్కింది.

………………………………………….: కర్నూలులో కాల్‌మనీ కలకలం-మహిళపై దాడి

2031లో భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా పురుషుల వరల్డ్ కప్ కు వేదికగా నిలవనున్నాయి.

సంవత్సరాల వారీగా టోర్నమెంట్ వివరాలిలా:
* 2024 టీ20 వరల్డ్ కప్ : అమెరికా, వెస్టిండీస్
* 2025 ఛాంపియన్స్ ట్రోఫి : పాకిస్థాన్
* 2026 టీ20 వరల్డ్ కప్ : భారత్, శ్రీలంక
* 2027 వన్డే వరల్డ్ కప్ : సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా
* 2028 టీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా, న్యూజిలాండ్
* 2029 ఛాంపియన్స్ ట్రోఫి : భారత్
* 2030 టీ20 వరల్డ్ కప్ : ఇంగ్లాండ్, ఐర్లాండ్, స్కాట్లాండ్
* 2031 వన్డే వరల్డ్ కప్ : భారత్, బంగ్లాదేశ్

ట్రెండింగ్ వార్తలు