ICC Awards 2019: వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రోహిత్ శర్మ

సంవత్సరమంతా అద్భుతమైన ప్రదర్శన చేసిన రోహిత్ శర్మ.. వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ సొంతం చేసుకున్నాడు. 2019కి గానూ టెస్టు, వన్డే ఫార్మాట్లలో ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ అవార్డులను ప్రకటించింది. ఈ మేర రోహిత్ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ గెలుచుకోగా.. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. 

న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో 84పరుగులు చేసి 719పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేగాక 20వన్డేలలో 12వికెట్లు పడగొట్టాడు. టెస్టు క్రికెట్ లోనూ అదే హవాతో దూసుకెళ్లాడు. 11టెస్టుల్లో 22వికెట్లు తీసి 821పరుగులు సాధించాడు. లీడ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 135పరుగులతో హైలెట్ గా నిలిచాడు. 

టెస్టు ప్లేయర్ ఇయర్ ఆఫ్ ఇయర్ అవార్డును పాట్ కమిన్స్ సొంతం చేసుకున్నాడు. భారత యువ క్రికెటర్ దీపక్ చాహర్ టీ20 పర్ఫామెన్స్ ఆఫ్ ద ఇయర్ గెలిచాడు. ఆస్ట్రేలియా మార్నస్ ఎమర్జింగ్ క్రికెటర్ ఇయర్ ఆఫ్ ద ఇయర్. స్కాట్‌లాండ్ కైలె అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గెలిచాడు. వరల్డ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ బెన్ స్టోక్స్‌కు సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ అందజేస్తారు.