AUS vs AFG: మాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీ.. ఆస్ట్రేలియా సంచ‌ల‌న‌ విజ‌యం

వన్డే ప్రపంచకప్ 39 మ్యాచ్ లో ఆస్ట్రేలియా, అప్గానిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి.

icc cricket world cup 2023 today australia vs afghanistan live match score

ఆస్ట్రేలియా విజ‌యం..
మాక్స్‌వెల్ డ‌బుల్ సెంచ‌రీతో విరుచుకుప‌డ‌డంతో ఆస్ట్రేలియా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. 292 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 46.5 ఓవ‌ర్ల‌లో ఏడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

మాక్స్‌వెల్ 150..
మాక్స్‌వెల్ దంచికొడుతున్నాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 104 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స‌ర్ల‌తో 151 ప‌రుగులు చేశాడు. 42 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 245/7. మాక్స్‌వెల్ (155), క‌మిన్స్ (11) లు ఆడుతున్నారు.

మాక్స్‌వెల్ శ‌త‌కం..
ఓ వైపు వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికీ మాక్స్‌వెల్ దంచికొడుతున్నాడు. నూర్ అహ్మ‌ద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 76 బంతుల్లో 10 ఫోర్లు, 3సిక్స‌ర్ల‌తో సెంచ‌రీ పూర్తి చేశాడు.

మాక్స్‌వెల్ హాఫ్ సెంచ‌రీ
నూర్ అహ్మ‌ద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి 51 బంతుల్లో మాక్స్‌వెల్ హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 27 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 140 7. పాట్ క‌మిన్స్ (7), మాక్స్‌వెల్ (55) లు ఆడుతున్నారు.

7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా బ్యాటర్లను అఫ్గానిస్థాన్ బౌలర్లు వణికిస్తున్నారు. అఫ్గాన్ బౌలర్ల ధాటికి 91 పరుగులకే ఆసీస్ 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆరంభంలోనే ఆస్ట్రేలియాకు భారీ షాక్
292 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. వార్నర్ 18, మిచెల్ మార్ష్ 24 పరుగులు చేసి అవుటయ్యారు. ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ డకౌటయ్యారు.

ముగిసిన అఫ్గానిస్థాన్ బ్యాటింగ్
ఆస్ట్రేలియాకు అఫ్గానిస్థాన్​​ 292 పరుగుల టార్గెట్ పెట్టింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 291 పరుగులు చేసింది. ఇబ్రహీం జద్రాన్ అజేయ సెంచరీతో సత్తా చాటాడు. జద్రాన్ 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. చివర్లో రషీద్ ఖాన్ చెలరేగాడు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు బాదాడు. రహ్మత్ షా 30, షాహిదీ 26, అజ్మతుల్లా 22 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.

ఇబ్రహీం జద్రాన్ సెంచరీ..
అఫ్గానిస్థాన్​​ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ సెంచరీ సాధించాడు. 130 బంతుల్లో 7 ఫోర్లతో శతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 5వ సెంచరీ. కాగా, ప్రపంచకప్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన అఫ్గాన్ బ్యాటర్ జద్రాన్ నిలిచాడు. అతి చిన్న వయసులో వరల్డ్ కప్ సెంచరీ సాధించిన వారిలో అతడు నాలుగోవాడు. 44 ఓవర్లలో 216/4 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

 

షాహిదీ అవుట్.. మూడో వికెట్ డౌన్
అఫ్గానిస్థాన్​​ 173 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. హష్మతుల్లా షాహిదీ 26 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇబ్రహీం జద్రాన్ 85 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు.

రహ్మత్ షా అవుట్.. రెండో వికెట్ డౌన్
అఫ్గానిస్థాన్​​ 121 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. రహ్మత్ షా 30 చేసి గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 29 ఓవర్లలో 136/2 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది. ఇబ్రహీం జద్రాన్ 70, షాహిదీ 9 పరుగులతో ఆడుతున్నారు.

నిలకడగా ఆడుతున్న అఫ్గానిస్థాన్.. జద్రాన్ హాఫ్ సెంచరీ
అఫ్గానిస్థాన్​​ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ హాఫ్ సెంచరీ చేశాడు. 56 పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు. అతడికి తోడుగా రహ్మత్ షా 17 పరుగులతో ఆడుతున్నాడు. 20 ఓవర్లలో 99/1 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

 

రహ్మానుల్లా అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న అఫ్గానిస్థాన్​​ 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రహ్మానుల్లా గుర్బాజ్ 21 పరుగులు చేసి హేజిల్‌వుడ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 12 ఓవర్లలో 57/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. జద్రాన్ 31, రహ్మత్ షా 5 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్​​
టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్​​ బ్యాటింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థిని, పిచ్ ను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న్టట్టు అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు. ఫజల్‌హక్‌ ఈరోజు ఆడడం లేదని.. అతడి ప్లేస్ లో నవీన్-ఉల్-హక్ బరిలోకి దిగుతున్నాడని చెప్పాడు. ఆస్ట్రేలియా జట్టులో రెండు మార్పులు జరిగాయి. స్టీవ్ స్మిత్, కామ్ గ్రీన్ స్థానంలో మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్ జట్టులోకి వచ్చారు.

 

తుది జట్లు
అఫ్గానిస్థాన్​​: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

అఫ్గానిస్థాన్​​ అద్భుతం చేస్తుందా?
AUS vs AFG: వన్డే ప్రపంచకప్ ఆసక్తికరంగా సాగుతోంది. సెమీస్ ఫైనల్లో రెండు స్థానాల కోసం నాలుగు జట్లు పోటీ పడుతున్నాయి. ఈరోజు ముంబైలోని వాఖండే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్​​ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ లో స్థానం ఖాయం చేసుకోవాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. 10 పాయింట్లతో ఆసీస్ మూడో స్థానంలో ఉంది. 8 పాయింట్లతో అఫ్గానిస్థాన్​​ ఆరో స్థానంలో నిలిచింది. వరుసగా నాలుగు విజయాలతో జోరు మీదున్న ఆస్ట్రేలియాను అడ్డుకోవాలంటే అఫ్గానిస్థాన్​​ అద్భుతం చేయాల్సిందే.