ENG vs SL: డిఫెండింగ్ ఛాంపియన్ కు షాక్‌.. ఇంగ్లాండ్ పై శ్రీలంక ఘ‌న విజ‌యం

డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ వరుసగా మూడో ఓటమిని మూటగట్టుకుంది. శ్రీలంక చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.

ENG vs SL

శ్రీలంక ఘ‌న విజ‌యం
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు శ్రీలంక షాకిచ్చింది. 157 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది.

సమరవిక్రమ హాఫ్ సెంచరీ
సదీర సమరవిక్రమ హాఫ్ సెంచరీ చేశాడు. 44 బంతుల్లో 5 ఫోర్లు సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. 23 ఓవర్లలో 135/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

నిస్సాంక హాఫ్ సెంచరీ
పాతుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ చేశాడు. 55 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో అర్ధశతకం పూర్తి చేశాడు. అతడికి తోడుగా సదీర సమరవిక్రమ (42) క్రీజ్ లో ఉన్నాడు. 18 ఓవర్లలో 110/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

15 ఓవర్లలో శ్రీలంక స్కోరు 87/2
స్వల్ప స్కోరుకే 2 వికెట్టు కోల్పోయినా డకోలుకుంది. పాతుమ్ నిస్సాంక, సదీర సమరవిక్రమ జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 85 పరుగులు దాటించారు. 15 ఓవర్లలో 87/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

మెండిస్ అవుట్.. రెండో వికెట్ డౌన్
23 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ నష్టపోయింది. లంక కెప్టెన్ కుశాల్ మెండిస్ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. 10 ఓవర్లలో 56/2 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

కుశాల్ పెరీరా అవుట్.. ఫస్ట్ వికెట్ డౌన్
157 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన శ్రీలంక 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కుశాల్ పెరీరా 4 పరుగులు చేసి అవుటయ్యాడు. 3 ఓవర్లలో 15/1 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

తక్కువ స్కోరుకే ఇంగ్లండ్ ఆలౌట్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే?
శ్రీలంకకు ఇంగ్లండ్ 157 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 33.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటయింది. ది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెక్ స్టోక్ (43) ఒక్కడే పోరాడాడు. బెయిర్‌స్టో 30, డేవిడ్ మలన్ 28, మొయిన్ అలీ 15, డేవిడ్ విల్లీ 14 పరుగులు చేశారు. జో రూట్ (3), జోస్ బట్లర్ (8), లివింగ్‌స్టోన్ (1) విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లు పడగొట్టాడు. మాథ్యూస్, కసున్ రజిత రెండేసి వికెట్లు తీశారు. మహేశ్ తీక్షణ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

 

రషీద్ అవుట్.. 9వ వికెట్ డౌన్
147 పరుగుల వద్ద ఇంగ్లండ్ 9వ వికెట్ కోల్పోయింది. ఆదిల్ రషీద్ 2 పరుగులు చేసి రనౌటయ్యాడు.

స్టోక్ అవుట్.. 8వ వికెట్ డౌన్
137 పరుగుల వద్ద ఇంగ్లండ్ 8వ వికెట్ కోల్పోయింది. జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన బెన్ స్టోక్స్ 43 పరుగులు చేసి అవుటయ్యాడు.

క్రిస్ వోక్స్ డకౌట్.. ఏడో వికెట్ డౌన్
ఇంగ్లండ్ బ్యాటింగ్ సైకిల్ స్టాండ్ ను తలపిస్తోంది. శ్రీలంక బౌలర్ల ధాటికి ఇంగ్లీషు బ్యాటర్లు వరుసగా వికెట్లు సమర్పిస్తున్నారు. 123 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఏడో వికెట్ చేజార్చుకుంది. క్రిస్ వోక్స్ డకౌటయ్యాడు. 30 ఓవర్లలో 137/7 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

మొయిన్ అలీ అవుట్.. ఆరో వికెట్ డౌన్
ఇంగ్లండ్ వరుసగా వికెట్లు కోల్పోలోంది. 122 పరుగుల వద్ద ఆరో వికెట్ చేజార్చకుంది. మొయిన్ అలీ 15 పరుగులు చేసి మాథ్యూస్ బౌలింగ్ లో అవుటయ్యాడు.

100 పరుగులు దాటిన ఇంగ్లండ్ స్కోరు
ఇంగ్లండ్ స్కోరు 100 పరుగులు దాటింది. 24 ఓవర్లలో 119/5 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది. బెన్ స్టోక్స్ 31, మొయిన్ అలీ 14 పరుగులతో ఆడుతున్నారు.

5 వికెట్లు డౌన్.. కష్టాల్లో ఇంగ్లండ్
85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్ కష్టాల్లో పడింది. లియామ్ లివింగ్‌స్టోన్(1) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. బెయిర్‌స్టో 30, డేవిడ్ మలన్ 28, జో రూట్ 3, జోస్ బట్లర్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.

 

బెయిర్‌స్టో అవుట్.. మూడో వికెట్ డౌన్
13.2 ఓవర్ లో 68 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో 30 పరుగులు చేసి కసున్ రజిత బౌలింగ్ లో అవుటయ్యాడు. 14 ఓవర్లలో 71/3 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్
ఇంగ్లండ్ 57 పరుగులకు రెండు వికెట్లు నష్టపోయింది. డేవిడ్ మలన్ 28 పరుగులు చేసి మాథ్యూస్ బౌలింగ్ లో అవుటయ్యాడు. జో రూట్ (3) రనౌటయ్యాడు. 12 ఓవర్లలో 66/2 స్కోరుతో ఇంగ్లండ్ ఆట కొనసాగిస్తోంది.

 

6 ఓవర్లలో ఇంగ్లండ్ 44/o
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా తొలి 6 ఓవర్లలో 44 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో 16, డేవిడ్ మలన్ 28 పరుగులతో ఆడుతున్నారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్
టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశముందని, అందుకే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నామని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. బ్రూక్, టోప్లీ, అట్కిన్సన్ స్థానంలో క్రిస్ వోక్స్, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ తుది జట్టులోకి వచ్చారు. టాస్ గెలిస్తే తాము కూడా బ్యాటింగ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నామని శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ అన్నాడు. ఏంజెలో మాథ్యూస్, లహిరు కుమార తుది జట్టులో ఉన్నారని చెప్పాడు.

 

తుది జట్లు
ఇంగ్లాండ్: జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, జోస్ బట్లర్(కెప్టెన్/వికెట్ కీపర్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, లహిరు కుమార, దిల్షన్ మధుశంక

మాథ్యూస్ వస్తున్నాడు
శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ ఈరోజు మ్యాచ్ ఆడతాడని తెలుస్తోంది. గాయపడిన మతీషా పతిరానాకు బదులుగా అతడు బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. 2019 ప్రపంచ కప్‌లో లీడ్స్‌లో ఇంగ్లాండ్‌పై శ్రీలంక విజయం సాధించడంలో మాథ్యూస్ కీలకపాత్ర పోషించాడు. మాథ్యూస్ ఈరోజు బరిలోకి దిగితే ఎలా ఆడతాడో చూడాలి. కాగా, ఇంగ్లండ్ ప్లేయర్ రీస్ టోప్లీ గాయం కారణంగా ప్రపంచకప్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో బ్రైడన్‌ కార్స్‌ని ఎంపిక చేశారు.

 

ENG vs SL : ఐసీసీ వన్డే ప్రపంచకప్ 25 మ్యాచ్ లో ఇంగ్లండ్, శ్రీలంక తలపడుతున్నాయి. బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడి ఒక్క విజయాన్ని మాత్రమే అందుకుంది. శ్రీలంక టీమ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. మెరుగైన రన్ రేటుతో శ్రీలంక 7వ స్థానంలో ఉండగా, ఇంగ్లీషు టీమ్ 8వ ప్లేస్ లో కొనసాగుతోంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మిగతా అన్ని మ్యాచ్ ల్లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే.

ట్రెండింగ్ వార్తలు