ICC World Cup 2023: నింగిలో వన్డే ప్రపంచకప్ 2023 ట్రోఫీ ఆవిష్కరణ.. నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండింగ్.. వీడియో వైరల్
ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీ టూర్ అద్భుతమైన పద్ధతిలో ప్రారంభించబడింది.
- Harish Thanniru
- Updated on- June 27, 2023 / 09:31 AM IST
ICC World Cup 2023
ODI World Cup Trophy : ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్-2023 (ICC Mens World Cup 2023) ట్రోపీ అద్భుతమైన పద్దతిలో ప్రారంభమైంది. భూమికి 1,20,000 అడుగుల ఎత్తులో ట్రోఫీని ఐసీసీ ఆవిష్కరించింది. బిస్పోక్ బెలూన్ (Bespoke balloon) సహాయంతో ట్రోఫీని అంతరిక్షం అంచులకు పంపించారు. అక్కడ ‘స్ట్రోటోస్ఫియర్’ ను ట్రోఫీ చేరింది. ఆ సమయంలో 4కె కెమెరాలతో ట్రోఫీని కొన్ని షాట్స్ తీశారు. అనంతరం ట్రోఫీ క్రమంగా నేలకు చేరుతూ వచ్చింది. చివరికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ల్యాండ్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ప్రక్రియకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సెక్రటరీ జై షా తన అధికారిక ట్విటర్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు.
ICC ODI World Cup-2023: కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ కప్‌లో కీలక పాత్ర పోషిస్తారు: గంభీర్
మంగళవారం నుంచి ట్రోఫీ యాత్ర ప్రారంభమవుతుంది. కువైట్, బహ్రెయిన్, మలేసియా, అమెరికా, నైజీరియా, ఉగాండ, ఇటలీ, ఆతిథ్య భారత్ సహా సుమారు ఇరవై దేశాల్లో సాగుతుంది. ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ ట్రోఫీ టూర్ కౌంట్‌డౌన్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ టోర్నీ అతి పెద్దది. క్రికెట్ కు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. ఈ క్రీడలో గొప్ప దిగ్గజాలలో కొందరు ఈ ప్రసిద్ధ ట్రోఫీకి దగ్గరగా ఉండే అవకాశాన్ని వీలైంత ఎక్కుమందికి అందించాలనుకుంటున్నాము అని చెప్పారు.
ICC World Cup 2023 : ఐసీసీ కీలక అప్డేట్.. ఆగస్ట్ 29 డెడ్ లైన్.. దేనికంటే..?
బీసీసీఐ సెక్రటరీ జే షా మాట్లాడుతూ.. క్రికెట్ భారతదేశాన్ని ఏకం చేస్తుంది. ఆరు వారాల పాటు ప్రపంచంలోని పది అత్యుత్తమ జట్లకు ఆతిథ్యం ఇవ్వడానికి మేము సిద్ధమవుతున్నందున దేశవ్యాప్తంగా ఉత్సాహం పెరుగుతోందని అన్నారు. ఈ ట్రోఫీ టూర్ మంగళవారం ప్రారంభమై దాదాపు ఇరవై దేశాల్లో పర్యటించి సెప్టెంబర్ 4వ తేదీన భారత్ దేశంకు తిరిగి చేరుకుంటుంది.
ఇదిలాఉంటే ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 కు సమయం దగ్గరపడుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే అవకాశం ఉంది. భారత్ ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తుంది. ప్రపంచ కప్ కోసం ఇప్పటికే బీసీసీఐ డ్రాప్ట్ షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
