ICC World Cup 2023 : ఐసీసీ కీల‌క అప్‌డేట్‌.. ఆగ‌స్ట్ 29 డెడ్ లైన్‌.. దేనికంటే..?

ఈ ఏడాది అక్టోబ‌ర్‌-నవంబ‌ర్‌లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023 (ICC World Cup 2023) జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐ (BCCI) ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.

ICC World Cup 2023 : ఐసీసీ కీల‌క అప్‌డేట్‌.. ఆగ‌స్ట్ 29 డెడ్ లైన్‌.. దేనికంటే..?

Deadline for WC squad submission

ICC Deadline : ఈ ఏడాది అక్టోబ‌ర్‌-నవంబ‌ర్‌లో భార‌త్ వేదిక‌గా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌-2023 (ICC World Cup 2023) జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే బీసీసీఐ (BCCI) ప్ర‌పంచ‌క‌ప్ నిర్వ‌హ‌ణ‌కు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది. ముసాయిదా షెడ్యూల్‌ను రూపొందించిన బీసీసీఐ దాన్ని ఐసీసీ (ICC)కి పంపింది. ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ జూన్ 27న ప్ర‌క‌టించ‌నుంది. టోర్నీ ప్రారంభానికి 100 రోజుల ముందు షెడ్యూల్‌ను వెల్ల‌డించ‌నున్నారు.

ముసాయిదా షెడ్యూల్ ప్రకారం మెగా టోర్నీ అక్టోబ‌ర్ 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో మెగా టోర్నీలో పాల్గొనే జ‌ట్లు త‌మ ఆట‌గాళ్ల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆగ‌స్టు 29 వ‌ర‌కు పంపాల్సి ఉంటుంది. అంటే మ‌రో రెండు నెల‌ల స‌మ‌యం మాత్రమే ఉంది.

1983 World Cup : ప‌సికూన అనుకున్న జ‌ట్టు.. విశ్వ‌విజేత‌గా నిలిచి 40 ఏళ్లు

టీ20 ప్రపంచ కప్ 2022 పరాజయం తర్వాత బీసీసీఐ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. చీఫ్ సెల‌క్ట‌ర్ చేత‌న్ శ‌ర్మ మిన‌హా మిగిలిన సెల‌క్ట‌ర్ల‌పై వేటు వేసింది. అయితే.. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఓ ఛాన‌ల్ స్టింగ్ ఆప‌రేష‌న్ త‌రువాత చేత‌న్ స్వ‌యంగా త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. దీంతో అత‌డి స్థానంలో శివ సుంద‌ర్ దాస్ ను తాత్కాలిక చీఫ్ సెల‌క్ట‌ర్‌గా నియ‌మించారు. అత‌డి నేతృత్వంలోని న‌లుగురు సెల‌క్ట‌ర్లు డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌కు జ‌ట్టును ఎంపిక చేయ‌గా అక్క‌డ ఆశించిన ఫ‌లితం రాలేదు.

దీంతో బీసీసీఐ కొత్త చీఫ్ సెల‌క్ట‌ర్ ప‌ద‌వి కోసం ద‌రఖాస్తుల‌ను ఆహ్వానించింది. ప్ర‌పంచ‌క‌ప్‌లో పాల్గొనే ఆట‌గాళ్ల వివ‌రాల‌ను మ‌రో 60 రోజుల్లో ఐసీసీకి పంపాల్సి ఉన్న నేప‌థ్యంలో ఈ లోపు కొత్త చీఫ్ సెల‌క్ట‌ర్‌ను నియ‌మించాల‌ని బీసీసీఐ బావిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆసియా క‌ప్ కంటే ముందే కొత్త చీఫ్ సెల‌క్ట‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Asian Games 2023 : చైనా వేదిక‌గా ఆసియా క్రీడ‌లు.. బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం..? రోహిత్‌, కోహ్లిని పంపేదే లే..!

టీమ్ఇండియా వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సాధించి 12 సంవ‌త్స‌రాలు అయ్యింది. ఇంత వ‌ర‌కు మ‌రో ప్ర‌పంచ‌క‌ప్‌ను సాధించ‌లేదు. ఈ ఏడాది స్వ‌దేశంలోనే మెగా టోర్నీ జ‌రుగుతుండ‌డంతో విజేత‌గా నిలిచేందుకు ఇంత కంటే మంచి స‌మ‌యం ఉండ‌దని అభిమానులు అంటున్నారు.