U19 World Cup 2026 Representative Image (Image Credit To Original Source)
U19 World Cup 2026: అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో కుర్రాళ్లు కుమ్మేశారు. అప్ఘానిస్తాన్ పై సంచలన విజయాన్ని నమోదు చేశారు. భారీ లక్ష్యాన్ని సైతం అలవోకగా చేజ్ చేశారు. సెమీస్ లో 7 వికెట్ల తేడాతో యంగ్ ఇండియా విజయదుందుభి మోగించింది. 311 పరుగుల భారీ టార్గెట్ ను మరో 53 బంతులు మిగిలి ఉండగానే ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగుల భారీ స్కోర్ చేసింది. 311 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది.
ఓపెనర్ ఆరోన్ జార్జ్ సెంచరీతో చెలరేగాడు. 104 బంతుల్లో 115 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 15 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరోసారి వీరవిహారం చేశాడు. హాఫ్ సెంచరీతో మెరిశాడు. 33 బంతుల్లోనే 68 రన్స్ చేశాడు. ఆయుష్ మాత్రే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో రాణించాడు. 59 బంతుల్లో 62 రన్స్ చేశాడు. విహాన్ మల్హోత్రా 47 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. ఫిబ్రవరి 6న ఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో భారత్ తలపడనుంది.
అఫ్గానిస్తాన్ జట్టులో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో చెలరేగారు. ఫైసల్ షినోజాడా (93 బంతుల్లో 110 రన్స్-15 ఫోర్లు), ఉజైరుల్లా నియాజై (86 బంతుల్లో 101 నాటౌట్.. 12 ఫోర్లు, 2 సిక్స్ లు) శతకాలు బాదడంతో 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఉస్మాన్ సాదత్ (39), ఖలీద్ అహ్మద్ జాయ్ (31) లు రాణించారు. భారత బౌలర్లలో దీపేష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.