ICC Player of the Month : ఐసీసీ అవార్డుల్లో టీమ్ఇండియా ప్లేయర్ల హవా.. అటు మంధాన, ఇటు బుమ్రా..
ఐసీసీ అవార్డుల్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు.
- Thota Vamshi Kumar
- Updated on- July 9, 2024 / 04:51 PM IST
ICC Player of the Month winner for June revealed
ICC Player of the Month : ఐసీసీ అవార్డుల్లో భారత ప్లేయర్లు అదరగొట్టారు. పురుషుల విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహిళల విభాగంలో స్మృతి మంధాన లు జూన్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను గెలుచుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలవడంలో పేసర్ జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 4.17 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో పురుషుల విభాగంలో రోహిత్ శర్మ, పజల్ హక్ ఫారూఖీలను వెనక్కి నెట్టి మరీ బుమ్రా ఈ అవార్డును సాధించాడు.
ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రావడం పట్ల బుమ్రా స్పందించాడు. ఈ అవార్డును గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు. వెస్టిండీస్‌లో గడిపిన సమయం తన జీవితంలో ఎంతో మధురమైందన్నాడు. జట్టుగా మేము సంబరాలు చేసుకుంటూనే ఉన్నామని చెప్పాడు. ఇలాంటి సమయంలో వ్యక్తిగతంగా కూడా ఇలాంటి అవార్డు రావడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు.
David Warner : రిటైర్మెంట్ పై డేవిడ్ వార్నర్ యూటర్న్..! ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్..
ఇక మహిళల విభాగంలో భారత స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన జూన్ నెలకుగానూ ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్‌కు చెందిన మైయా బౌచియర్, శ్రీలంకకు చెందిన విష్మి గుణరత్నేలను వెనక్కి నెట్టి మరీ ఈ అవార్డును సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో వన్డేల్లో రెండు వరుస సెంచరీలు, ఆపై ఏకైక టెస్టు మ్యాచులో 149 పరుగులతో మంధాన రాణించింది.
Chris Gayle : 44 ఏళ్ల వయసులోనూ క్రిస్‌గేల్ వీరవిహారం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజయం..
