Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

44 ఏళ్ల వ‌య‌సులోనూ త‌న‌లోని ఆట ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్‌.

Chris Gayle : 44 ఏళ్ల వ‌య‌సులోనూ క్రిస్‌గేల్ వీర‌విహారం.. ద‌క్షిణాఫ్రికాపై వెస్టిండీస్ విజ‌యం..

Chris Gayle

Updated On : July 13, 2024 / 12:58 PM IST

44 ఏళ్ల వ‌య‌సులోనూ త‌న‌లోని ఆట ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తున్నాడు వెస్టిండీస్ దిగ్గ‌జ ఆట‌గాడు, యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్‌. వ‌ర‌ల్డ్‌ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో బ‌రిలోకి దిగిన గేల్ త‌నదైన శైలిలో చెల‌రేగుతూ అభిమానుల‌ను అల‌రిస్తున్నాడు. ద‌క్షిణాఫ్రికా ఛాంప్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేవ‌లం 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు బాది 70 ప‌రుగులు చేశాడు. గేల్ విధ్వంసంతో ఈ మ్యాచ్‌లో విండీస్ ఛాంప్స్ 6 వికెట్ల తేడాతో విజ‌యాన్ని సాధించింది.

ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంప్స్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్ల‌లో ఆష్వెల్ ప్రిన్స్ (35 బంతుల్లో 46), డేన్ విలాస్ (17 బంతుల్లో 44 నాటౌట్) లు రాణించారు. వెస్టిడీస్ బౌల‌ర్ల‌లో జాసన్ మహమ్మద్ రెండు వికెట్లు, బ‌ద్రీ ఓ వికెట్ తీశారు.

Also Read: బీసీసీఐ ప్రైజ్‌మ‌నీ 125 కోట్ల‌ను ఆట‌గాళ్ల‌కు ఎలా పంచారో తెలుసా..? ఎవ‌రు ఎక్కువ అందుకున్నారంటే..?

అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో యూనివ‌ర్స‌ల్ బాస్ క్రిస్‌గేల్ (70; 40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడాడు. 44 వ‌య‌సులోనూ సిక్స‌ర్లు, ఫోర్ల‌తో అభిమానుల‌ను అల‌రించాడు. టీ20ల్లో గేల్‌కు ఇది 89 హాఫ్ సెంచ‌రీ కావ‌డం విశేషం. అత‌డికి తోడుగా చాడ్విక్ వాల్టన్ (56 నాటౌట్; 29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించ‌డంతో ల‌క్ష్యాన్ని విండీస్ 19.1 ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు న‌ష్ట‌పోయి అందుకుంది.

ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో వెర్నాన్ ఫిలాండర్ రెండు వికెట్లు తీశాడు, చార్ల్ లాంగేవెల్డ్ట్, నీల్ మెకంజీ చెరో వికెట్ తీశారు.

Also Read : ఆ క‌సితోనే బ‌రిలోకి దిగా.. రికార్డు సెంచ‌రీ త‌రువాత అభిషేక్ శర్మ కీల‌క వ్యాఖ్య‌లు