×
Ad

U19 World Cup 2026 : సెమీస్ మ్యాచ్‌.. టాస్ గెలిచిన అఫ్గాన్‌.. తొలుత బౌలింగ్ చేయ‌నున్న భార‌త్‌..

అండ‌ర్‌19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌2026లో (U19 World Cup 2026) భాగంగా హ‌రారే వేదిక‌గా సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

ICC Under 19 World Cup 2026 Afghanistan opt to bat

U19 World Cup 2026 : అండ‌ర్‌19 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌2026లో భాగంగా హ‌రారే వేదిక‌గా బుధ‌వారం సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భార‌త్ తొలుత బౌలింగ్ చేయ‌నుంది. ఈ టోర్నీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోని భార‌త్.. ఈ మ్యాచ్‌లోనూ విజ‌యం సాధించి ఫైన‌ల్‌కు దూసుకెళ్లాల‌ని భావిస్తోంది.

‘మేము ముందుగా బ్యాటింగ్ చేస్తాము. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. భారీ స్కోరు చేసి ప్ర‌త్య‌ర్థిని ఒత్తిడిలోకి నెడ‌తాము. ఫైసల్  చాలా చ‌క్క‌గా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లోనూ రాణించి ఫైన‌ల్‌కు చేరుకుంటాము.’ అని అఫ్గానిస్తాన్ కెప్టెన్ మహబూబ్ ఖాన్ అన్నాడు.

Ishan Kishan : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు ఇషాన్ కిష‌న్ కీల‌క వ్యాఖ్య‌లు.. అత‌డి బౌలింగ్‌లో ఆడ‌లేను.. న‌న్ను బాగా ఇబ్బంది ప‌ట్టే బౌల‌ర్ అత‌నొక్క‌డే..

‘టాస్ ఓడిపోయిన‌ప్ప‌టికి ఎలాంటి బాధ‌లేదు. ఎందుకంటే టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాల‌ని అనుకున్నాం. వికెట్ చాలా బాగుంది. మా ప్లేయ‌ర్లు అద్భుతంగా ఆడుతున్నారు. మా శ‌క్తి సామ‌ర్థ్యాల‌ మేర‌కు ఆడితే విజ‌యం సాధించ‌డం పెద్ద క‌ష్టం కాదు. తుది జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు.’ అని ఆయుష్ మాత్రే తెలిపాడు.

అఫ్గానిస్తాన్ అండ‌ర్‌-19 జ‌ట్టు..

ఉస్మాన్ సదాత్, ఖలీద్ అహ్మద్జాయ్, ఫైసల్ షినోజాదా, ఉజైరుల్లా నియాజై, మహబూబ్ ఖాన్(కెప్టెన్‌), అజీజుల్లా మియాఖిల్, అబ్దుల్ అజీజ్, ఖతీర్ స్టానిక్జాయ్, రూహుల్లా అరబ్, నూరిస్తానీ ఒమర్జాయ్, వహిదుల్లా జద్రాన్

Nandni Sharma : చ‌రిత్ర సృష్టించిన నందిని శ‌ర్మ‌.. డ‌బ్ల్యూపీఎల్‌లో ఏకైక భార‌త ప్లేయ‌ర్‌.. బాల్ వేస్తే వికెట్ ప‌డాల్సిందే..

భార‌త అండ‌ర్‌-19 తుది జ‌ట్టు..

ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(కెప్టెన్‌), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీప‌ర్‌), ఆర్ఎస్‌ అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్.