T20 World Cup 2026 : వర్షం కారణంగా గ్రూప్-బి మ్యాచ్‌లు అన్ని రద్దైతే..! సెమీస్‌కు చేరుకునే రెండు జట్లు ఇవే..
టీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026) వర్షం కారణంగా గ్రూప్-బిలో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు అయితే సెమీస్ చేరుకునే జట్లను ఏ విధంగా నిర్ధారిస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published On : February 22, 2026 / 11:24 AM IST
If all Super Eights Group B matches in Sri Lanka are called off due to rain which teams will qualify
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో గ్రూప్ దశ ముగిసింది. భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్, ఇంగ్లాండ్, శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు సూపర్-8కు అర్హత సాధించాయి. శనివారం నుంచి సూపర్-8 దశ ప్రారంభమైంది. సూపర్-8లో భాగంగా శనివారం జరగాల్సిన పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబోలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో వర్షం కారణంగా సూపర్-8లో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌లు ప్రభావితం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యంగా గ్రూప్-బి మ్యాచ్‌లు అన్ని శ్రీలంకలోనే షెడ్యూల్ అయ్యాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లాండ్, శ్రీలంక జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇప్పుడు వర్షం కారణంగా గ్రూప్-బిలో షెడ్యూల్ చేయబడిన మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు అయితే సెమీస్ చేరుకునే జట్లను ఏ విధంగా నిర్ధారిస్తారు అన్న ప్రశ్న ఉదయిస్తోంది. నాలుగు నిబంధనల ద్వారా జట్లను నిర్ణయించే అవకాశం ఉంది.
నిబంధన 1..
గ్రూప్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్లు సెమీస్ చేరుకుంటాయి అని ఐసీసీ నిబంధన చెబుతోంది. అయితే.. వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దైతే అన్ని జట్లు సమాన పాయింట్లను కలిగి ఉంటాయి. కాబట్టి ఇది చెల్లదు.
నిబంధన 2..
గ్రూప్‌లో సమాన విజయాలు సాధించి సమాన పాయింట్లు సాధించిన జట్లు ఉంటే.. నెట్‌రన్‌రేటు మెరుగ్గా ఉన్న జట్లు ముందడు వేస్తాయి అని ఐసీసీ రూల్స్ చెబుతున్నాయి. అయితే.. వర్షం కారణంగా అన్ని మ్యాచ్‌లు రద్దు అయితే.. అప్పుడు అన్ని జట్ల రన్‌రేట్ ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ నిబంధన కూడా చెల్లదు.
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? రద్దు అయితే పరిస్థితి ఏంటి?
నిబంధన 3..
రెండు లేదా అంతకంటే ఎక్కు జట్లు సమాన పాయింట్లు, సమాన నెట్‌రన్‌రేటు ఉంటే.. అప్పుడు ఈ టోర్నీలో వారి మధ్య జరిగిన హెడ్-టు-హెడ్ మ్యాచ్‌లో విజేత ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే.. గ్రూప్-బిలో ఉన్న జట్లు ఇప్పటి వరకు ఈటోర్నీలో ఒకదానితో మరొకటి ఆడలేదు కాబట్టి ఇది కూడా చెల్లదు.
నిబంధన 4..
పైన పేర్కొన్న ఏ నిబంధన కూడా వర్కౌట్ కాకుండా ఉంటే అప్పుడు ర్యాంకింగ్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఈ మెగాటోర్నీ ప్రారంభానికి కన్నా ముందు రోజు అంటే 2026 ఫిబ్రవరి 6 న రోజు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా సెమీస్ చేరే జట్లను నిర్ణయిస్తారు. అంటే మెరుగైన ర్యాంకింగ్స్ ఉన్న జట్లు ముందంజ వేస్తుంది. అంటే ఈ లెక్కన రెండు, నాలుగో స్థానాల్లో ఉన్న ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ముందంజ వేస్తాయి. ఎందుకంటే పాక్ ఆరో స్థానంలో, శ్రీలంక ఎనిమిదిలో స్థానంలో ఉండడమే అందుకు కారణం.
