If IND vs AUS semis Match Is Washed Out what will happen which team goes Champions Trophy 2025 final
న్యూజిలాండ్ పై భారత్ విజయం సాధించి గ్రూప్-ఏలో అగ్రస్థానంతో సెమీస్ చేరుకుంది. ఈ క్రమంలో సెమీస్‌లో గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ మంగళవారం (మార్చి4న) దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ బుధవారం (మార్చి 5న) జరగనుంది.
లాహోర్ వేదికగా జరగనున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో న్యూజిలాండ్ ఢీ కొట్టనుంది. ఈ సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్ లో కప్పు కోసం పోటీపడతాయి. ఫైనల్ మ్యాచ్ మార్చి 9 (ఆదివారం) జరగనుంది. ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చే స్టేడియం అయితే ఇంకా ఫైనల్ కాలేదు.
భారత్ సెమీస్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది. అలా కానీ పక్షంలో పాకిస్థాన్‌లోని లాహోర్ వేదికగా ఫైనల్ జరగనుంది.
వర్షం కారణంగా సెమీస్, ఫైనల్ రద్దు అయితే..
ఛాంపియన్స్‌ట్రోఫీ 2025లో పలు మ్యాచ్‌లకు వరుణుడు పలకరించాడు. గ్రూప్ స్టేజీలో మూడు మ్యాచ్‌లు రద్దు అయ్యాయి. మ్యాచ్ లు రద్దు కావడంతో కొన్ని జట్ల సెమీస్ సమీకరణాలు తారుమారు అయ్యాయి. మ్యాచ్‌లు రద్దు అయిన సందర్భంలో గ్రూప్ స్టేజీలో ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.
మరి కీలకమైన సెమీస్, ఫైనల్ మ్యాచ్ రద్దు అయితే.. పరిస్థితి ఏంటి? విజేతలను ఎలా ప్రకటిస్తారు అన్న సంగతి ఓ సారి చూద్దాం..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రెండు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లకు ఐసీసీ రిజర్వ్‌డేలను టోర్నీకి ముందే ప్రకటించింది. ఈ క్రమంలో వర్షం వల్ల గానీ మరే ఇతర కారణం వల్ల షెడ్యూల్ రోజు మ్యాచ్ జరగకపోతే మరుసటి రోజును నిర్వహించే అవకాశం ఉంది.
వర్షం వల్ల మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోతుందో మరుసటి రోజు అక్కటి నుంచే ఆట కొనసాగనుంది. ఇక రిజర్వ్ డే రోజు సైతం మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేక రద్దు చేస్తే.. సెమీస్‌కు వచ్చిన రెండు జట్లలో గ్రూప్ లలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది.
అంటే ఈ లెక్కన భారత్, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు అయితే.. గ్రూప్ స్టేజీలో భారత్ అగ్రస్థానంలో నిలవడంతో ఫైనల్‌కు చేరుకుంటుంది. అయితే.. ఈ మ్యాచ్‌కు దాదాపుగా ఎలాంటి వర్షం ముప్పు లేదు. ఎందుకంటే ఈమ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
ఇక ఫైనల్ మ్యాచ్.. నిర్ణయించిన రోజు లేదా రిజర్వ్ డే రోజున వర్షం వల్ల రద్దు అయితే అప్పుడు ఇరు జట్లు ట్రోఫీని పంచుకుంటాయి.