If Pakistan boycott T20 World Cup 2026 clash against India do you know What will happen
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో ఆడాలని పాకిస్తాన్ నిర్ణయం తీసుకుంది. అయితే.. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను బహిష్కరించాలని పాక్ ప్రభుత్వం తమ జట్టుకు సూచించింది. ఈ క్రమంలో భారత్, పాక్ మ్యాచ్ పై అనిశ్చితి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది.
టీ20 ప్రపంచకప్‌లో భారత్, యూఎస్ఏ, నెదర్లాండ్స్, నమీబియాలతో పాటు పాకిస్తాన్ గ్రూప్-ఏలో ఉంది. ఒకవేళ పాక్ జట్టు భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే అప్పుడు భారత్ ఖాతాలో రెండు పాయింట్లు వచ్చి చేరుతాయి. కాగా.. గ్రూప్-ఏ నుంచి రెండు జట్లు మాత్రమే సూపర్ 8కి చేరుకుంటాయన్న సంగతి తెలిసిందే.
Babar Azam : చరిత్ర సృష్టించిన బాబర్ ఆజామ్.. కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్..
టీమ్ఇండియా ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏలపై అలవోకగా విజయాలను సాధిస్తుంది. ఫిబ్రవరి 15న జరగనున్న మ్యాచ్‌ను పాక్ బహిష్కరిస్తే భారత్ ఖాతాలో మరో రెండు పాయింట్లు చేరుతాయి. దీంతో గ్రూప్-ఏ టాపర్‌గా భారత్ తదుపరి దశ సూపర్ 8కి చేరుకుంటుంది.
యూఎస్ఏ మళ్లీ పాక్‌ను ఓడిస్తే..?
టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్తాన్‌ను సూపర్ ఓవర్‌లో యూఎస్ఏ ఓడించింది. దీంతో అప్పుడు పాక్ జట్టు గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించింది. ఇక తాజాగా టీ20 ప్రపంచకప్ 2026లోనూ పాక్ జట్టును మరోసారి యూఎస్ఏ ఓడిస్తే.. అప్పుడు పాక్ మరోసారి గ్రూప్ స్టేజీ నుంచే నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి.
పాక్‌ను ఓడించడంతో పాటు నెదర్లాండ్స్, నమీబియాలపై యూఎస్ఏ విజయం సాధిస్తే అప్పుడు యూఎస్ఏ ఖాతాలో 6 పాయింట్లు ఉంటాయి. ఒకవేళ పాక్ జట్టు నెదర్లాండ్స్, నమీబియాలను ఓడించినా అప్పుడు ఆ జట్టు ఖాతాలో 4 పాయింట్లే ఉంటాయి. గ్రూప్-ఏ టాపర్‌గా భారత్, రెండో స్థానంలో యూఎస్ఏ జట్లు తదుపరి దశకు అర్హత సాధిస్తాయి అప్పుడు పాక్ గ్రూప్ స్టేజీ నుంచే నిష్ర్కమించక తప్పదు.
ICC : భారత్‌తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే .. అలా చేస్తే..
టీ20 ప్రపంచకప్2026లో పాకిస్తాన్ జట్టు తమ మొత్తం మ్యాచ్‌లను శ్రీలంక వేదికగానే ఆడనుంది.