ILT20 : క్రికెట్ అభిమానులకు పండుగే.. నవంబర్ 21 నుంచి ఐఎల్‌టీ20 సీజన్‌-5 షురూ.. ఫైనల్ ఎక్కడంటే?

ILT20 : క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తి రేపుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20)- 2026 సీజన్ షెడ్యూల్ విడుదలైంది.

ILT20

ILT20 : క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో టీ20 టోర్నీ సిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్లో ఆసక్తి రేపుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 (ఐఎల్‌టీ20)- 2026 సీజన్ షెడ్యూల్ బుధవారం విడుదలైంది. యూఏఈ వేదికగా జరిగే ఐదో సీజన్ నవంబర్ 21న ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 20న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

Also Read : Ravindra Jadeja : రవీంద్ర జడేజా చీఫ్ సెలెక్టర్ అవుతాడా? బీసీసీఐ పోస్టుకు షాకింగ్ కామెంట్.. అలా అన్నావేంటి భయ్యా..!

ఐఎల్‌టీ20 టోర్నీలో తొలి మ్యాచ్‌లోనే గత సీజన్‌ ఫైనల్‌ రిపీట్‌ కానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ డెజర్ట్‌ వైపర్స్‌, సీజన్‌-2 ఛాంపియన్‌ ఎంఐ ఎమిరేట్స్‌తో తలపడనుంది. నవంబర్‌ 21న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.

గత సీజన్‌లో మాదిరిగానే ఈసారి కూడా టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. మొత్తం 34 మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రతి జట్టు లీగ్‌ దశలో 10 మ్యాచ్‌లు ఆడుతుంది. పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి. డిసెంబర్‌ 20న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో ఫైనల్‌ జరగనుంది.

ఈ టోర్నీలో డెజర్ట్ వైపర్స్, అబుదాబి నైట్‌రైడర్స్, దుబాయ్ క్యాపిటల్స్, గల్ఫ్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, షార్జా వారియర్జ్ బరిలోకి దిగనున్నాయి. ఈ టోర్నీలో మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 3.30 గంటలకు లేదా రాత్రి 8గంటలకు ప్రారంభం కానున్నాయి.