IND vs AFG 3rd ODI : యశస్వి సెంచరీ.. రోహిత్ విధ్వంసం.. 3-0తో ఆఫ్ఘాన్‌ను ఊడ్చేసిన భారత్!

IND vs AFG 3rd ODI : 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఆఫ్ఘాన్‌‌ను క్లీన్ స్వీప్ చేసింది టీమిండియా.. లక్ష్య ఛేదనలో చిత్తుగా ఓడించి 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.

IND vs AFG Result ( Image Credit : BCCI )

  • యశస్వి జైస్వాల్ సెంచరీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
  • 3-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
  • భారత్ మూడో వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలిచింది
  • ఆఫ్ఘనిస్తాన్‌పై వన్డేలలో ఇదే అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యం

IND vs AFG Result : యశస్వి జైస్వాల్ సెంచరీ, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలతో భారత్ మూడో వన్డేలో ఆఫ్ఘనిస్తాన్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 44.2 ఓవర్లలో 218 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో భారత్ 28.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 224 పరుగులతో వన్డీ సిరీస్ కైవసం చేసుకుంది.

భారత్ వన్డేలలో ఆఫ్ఘనిస్తాన్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌ను క్లీన్ స్వీప్ చేయడం (IND vs AFG 3rd ODI) ఇదే ఫస్ట్ టైమ్. ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయగా, రోహిత్, యశస్వి భారీ భాగస్వామ్యంతో జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు.

రోహిత్-యశస్విల భారీ భాగస్వామ్యం :
లక్ష్య ఛేదనలో భారత ఆటగాళ్లు యశస్వి, రోహిత్ బలమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఆరంభం నుంచే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ దాదాపు వికెట్ పడినట్టే కనిపించింది.

కానీ వికెట్ కీపర్ మిస్ చేయడంతో రోహిత్ లైఫ్ లైన్ దక్కింది. ప్రారంభంలో యశస్వి దూకుడుగా బ్యాటింగ్ చేయగా రోహిత్ ఓపికగా ఆడాడు. రోహిత్ గేర్లు మార్చి వేగంగా ఆడాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు తొలి వికెట్‌కు 170 పరుగులు జోడించారు. ఆఫ్ఘనిస్తాన్‌పై వన్డేలలో భారత్‌కు ఇదే అతిపెద్ద ఓపెనింగ్ భాగస్వామ్యంగా చెప్పొచ్చు.

మహమ్మద్ నబీ బౌలింగ్‌లో రోహిత్ వికెట్ కోల్పోయాడు. 69 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేసి అవుటయ్యాడు. యశస్వి 86 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 110 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు, శ్రేయస్ అయ్యర్ 19 బంతుల్లో 2 సిక్సర్లతో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున మహమ్మద్ నబీ సింగిల్ వికెట్ తీశాడు.

Read Also : Pawan Kalyan : క్రిమినల్స్‌కు కులం ఉండదు.. తప్పు చేస్తే ఎవరినైనా వదిలేది లేదు : పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య అన్ని ఫార్మాట్లలో 18 మ్యాచ్‌లు ఆడగా, ఆఫ్ఘనిస్తాన్ సింగిల్ మ్యాచ్ కూడా గెలవలేదు. భారత్ 15 మ్యాచ్‌లు గెలవగా, ఒకటి టైగా ముగిసింది. మరొకటి ఫలితం తేలలేదు.

షాహిది ఫస్ట్ వన్డే సెంచరీ :
అంతకుముందు, టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్, కేవలం 36 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పేలవమైన ఆటతో ఆరంభమైంది. ఆ తర్వాత షాహిది, ఒమర్జాయ్‌తో జతకట్టగా, ఈ ఇద్దరు 5వ వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఒమర్జాయ్ 50 పరుగుల వద్ద ఔట్ కావడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది.

అయినా షాహిది నిలకడగా ఆడుతూ మహమ్మద్ నబితో 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. నబి ఔట్ కాగా ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మరోసారి తడబడింది. వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఈ క్రమంలోనే షాహిది తొలి వన్డే సెంచరీని నమోదు చేశాడు.

షాహిది 131 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్‌తో 102 పరుగులు సాధించాడు. భారత్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీయగా, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబే తలా ఒక వికెట్ తీసుకున్నారు.