IND vs AUS
IND vs AUS 1st Test Match: తొలి టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. టీమిండియా స్పిన్నర్ల దాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేక పోయారు. అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వరుస ఓవర్లలో వికెట్లు తీయడంతో ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 91 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆసీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
https://twitter.com/BCCI/status/1624333433056137216?cxt=HHwWgMDQodep5YotAAAA
ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి టెస్ట్ మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆధిపత్యం చలాయించి ఆసీస్‌ను చిత్తు చేసింది. తొలి ఇన్నింగ్స్ 177 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన భారత్ జట్టు 400 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్.. మూడు గంటల వ్యవధిలోనే భారత్ స్పిన్నర్ల బౌలింగ్ ధాటికి 91 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓటమి అంచుకు చేరింది. భారత స్పిన్ ద్వయం ధాటికి ఆసీస్ బ్యాటర్లు క్రీజ్‌లో కుదురుకోలేక పోతున్నారు. అశ్విన్, జడేజా స్పిన్ బౌలింగ్ ధాటికి వరుస వికెట్లు కోల్పోతున్న ఆసీస్‌ను కొత్తగా అక్షర్ పటేల్ ఎంట్రీ ఇచ్చి మరో దెబ్బకొట్టాడు. అక్షర్ వేసిన 26వ ఓవర్లో మూడో బంతికి టాడ్ మార్ఫీ (2) రోహిత్ శర్మ చేతికి చిక్కాడు. దీంతో ఆసీస్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
ఆస్ట్రేలియా ఏడో వికెట్ కోల్పోయింది. అశ్విన్ స్పిన్ దెబ్బకు వరుస వికెట్లు కోల్పోయి విలవిల్లాడుతున్న ఆసిస్‌ను జడేజాకూడా దెబ్బకొట్టాడు. జడేజా వేసిన 23వ ఓవర్లో నాలుగో బంతికి పాట్ కమిన్స్ (1) వికెట్ కీపర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
భారత స్పిన్నర్ రవిచంద్రన్ స్పిన్ ధాటికి ఆసీస్ బ్యాటర్లు విలవిల్లాడుతున్నారు. క్రీజ్‌లో నిలవలేక పెవిలియన్ బాట పడుతున్నారు. 18వ ఓవర్లో రెండో బంతికి హ్యాండ్స్‌కాంబ్ (6) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ వెంటనే 20వ ఓవర్లో రెండో బంతి అలెక్స్ క్యారీ (10) వికెట్ల ముందు దొరికిపోయాడు.
అశ్విన్ స్పిన్ కు ఆసీస్ బ్యాటర్లు క్రీజ్‌లో నిలవలేక పోతున్నారు. దీంతో డెవిడ్ వార్నర్ (10)ను ఔట్ చేసిన అశ్విన్ ఆ వెంటనే.. మాట్ రెన్ షా(2)ను పెవిలియన్ కు పంపించాడు. అశ్విన్ వేసిన 16వ ఓవర్లో రెండో బంతికి వికెట్ల ముందు రెన్ షా దొరికిపోయాడు. దీంతో ఆసీస్ 42 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. అశ్విన్ మూడు వికెట్లు, జడేజా ఒక వికెట్ తీశారు.
నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. రెండో రోజు ఆటలో క్రీజ్‌లోకి వచ్చిన అక్షర్ పటేల్ జడేజాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మూడో రోజు ఆట ప్రారంభమైన వెంటనే జడేజా (70) ఔట్ అయినప్పటికీ అక్షర్ పటేల్ నిలకడగా ఆడుతూ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. మహ్మద్ షమీ ఔట్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన సిరాజ్ తో కలిసి దూకుడుగా ఆడే ప్రయత్నం చేసిన అక్షర్ పటేల్ 84 పరుగుల వద్ద టీమిండియా చివరి వికెట్‌గా ఔట్ అయ్యాడు. అక్షర్ దూకుడు చూసిన క్రికెట్ అభిమానులు సెంచరీ చేస్తాడని భావించారు. కానీ కమిన్స్ వేసిన బంతికి ఔట్ కావటంతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
https://twitter.com/BCCI/status/1624289266640764928?cxt=HHwWgIDS6e2e0YotAAAA
ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా మూడో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. 321/7 పరుగుల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా .. ఆదిలోనే జడేజా (70) వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన షమీ (37) దూకుడగా ఆడి ఔట్ అయ్యాడు. చివరిగా అక్షర్ పటేల్ (84) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 400 పరుగుల వద్ద ఇండియా ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాపై 223 పరుగుల ఆధిక్యంలో ఉంది.
https://twitter.com/BCCI/status/1624276789253251072?cxt=HHwWgIDRhcrIy4otAAAA
భారత్ జట్టు తొమ్మిదో వికెట్ కోల్పోయింది. మహ్మద్ షమీ దూకుడుగా ఆడి 47 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్స్ లు, రెండు ఫోర్లు ఉన్నాయి. మర్ఫీ బౌలింగ్‌లో క్యారీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్‌లోకి మహ్మద్ సిరాజుద్దీన్ వచ్చాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 391/9 (135 ఓవర్లు).
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాలో మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో మూడు రోజు ఆట ప్రారంభమైంది. టీమిండియా ఆటగాళ్లు వేగంగా పరుగులు రాబడుతున్నారు. రవీంద్ర జడేజా (70) ఔట్ అనంతరం క్రీజ్లోకి వచ్చిన మహ్మద్ షమీ (37) దూకుడుగా ఆడుతున్నాడు.
టీమిండియా స్కోర్ వేగం పుంజుకుంది. రవీంద్ర జడేజా ఔట్ అనంతరం క్రీజ్లోకి వచ్చిన మహ్మద్ షమీ దూకుడుగా ఆడుతున్నాడు. కేవలం 42 బంతుల్లో రెండు ఫోర్లు, మూడు సిక్సులతో 36 పరుగులు చేశాడు. మరోవైపు అక్షర్ పటేల్ వ్యక్తిగత స్కోర్ 70 పరుగులకు చేరింది. దీంతో టీమిండియా స్కోర్ వేగంగా పరుగు పెడుతోంది.. ప్రస్తుతం ఇండియా స్కోర్ 380/8.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే రవీంద్ర జడేజా (70) ఔట్ అయ్యాడు. అక్షర్ పటేల్ (63), మహ్మద్ షమీ (15) క్రీజ్‌లో ఉన్నారు. టీమిండియా 351 పరుగుల మార్క్‌ను తాకింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. అక్షర్ పటేల్ (58), మహ్మద్ షమీ (6) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 పరుగులు చేయగా.. భారత్ 337/8 పరుగులు చేసింది. ప్రస్తుతం 160 పరుగుల ఆధిక్యంలో టీమిండియా కొనసాగుతుంది.
https://twitter.com/BCCI/status/1624263393103474688?cxt=HHwWgMDT-ei8xYotAAAA