IND vs ENG : రెండో వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్.. భారత్ బ్యాటింగ్.. తుది జట్టులో కీలక మార్పు..
మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు (IND vs ENG) తలపడుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- July 16, 2026 / 05:19 PM IST
IND vs ENG 2nd ODI england won the toss team india bat first
IND vs ENG : మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా కార్డిఫ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఇక భారత జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. కేఎల్ రాహుల్ అనారోగ్యంతో దూరం కాగా అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
🚨 Toss Update from Cardiff 🚨
England have won the toss and elected to field first against #TeamIndia
Updates ▶️ https://t.co/2Z0BQOPWjC #ENGvIND pic.twitter.com/Xoabf9IWhV
— BCCI (@BCCI) July 16, 2026
‘టాస్ గెలిచి ఉంటే మేము కూడా బౌలింగ్ తీసుకునేవాళ్లం. గత మ్యాచ్‌లో బాగా ఆడాం. ఈ రోజు కూడా అలాంటి ప్రదర్శననే పునరావృతం చేస్తామని ఆశిస్తున్నాను. పేసర్లు రాణిస్తారని భావిస్తున్నాను. అనారోగ్యంతో కేఎల్ రాహుల్ దూరం కాగా అతడి స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు.’ అని శుభ్‌మన్ గిల్ తెలిపాడు.
ఇంగ్లాండ్ తుది జట్టు..
బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్
Here’s a look at #TeamIndia‘s Playing XI for the 2️⃣nd ODI in Cardiff 🙌
𝗡𝗼𝘁𝗲: KL Rahul was unavailable for selection due to illness.
Updates ▶️ https://t.co/2Z0BQOPWjC #ENGvIND pic.twitter.com/xHpfa2RqWW
— BCCI (@BCCI) July 16, 2026
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గుర్నూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ
