IND vs ENG 2nd T20 : ఇంగ్లాండ్‌తో రెండో టీ20 : భారత్ విజయలక్ష్యం 165

అహ్మదాబాద్,‌ మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.

Ind Vs Eng 2nd T20

IND vs ENG 2nd T20 Match : అహ్మదాబాద్‌‌లో మొతేరా స్టేడియం వేదికగా టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌.. టీమిండియాకు 165 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ ఓపెనర్లలో జేసన్‌ రాయ్‌(46), ఇయాన్‌ మోర్గాన్‌(28), బెన్‌స్టోక్స్‌(24), డావిడ్ మలన్ (24) పరుగులకే చేతులేత్తేశారు. జోస్ బట్లర్ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. శామ్ కరన్ (6 నాటౌట్), క్రిస్ జార్డన్ (0 నాటౌట్) గా నిలిచారు.

నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రత్యర్థి భారత్ జట్టుకు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకుర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ తలో రెండు వికెట్లు తీయగా.. చాహల్‌, భువనేశ్వర్‌ చెరో ఒక వికెట్‌ తీసుకున్నారు.


శార్ధూల్‌ ఠాకూర్‌ వేసిన 18వ ఓవర్‌ తొలి బంతికి ఇయాన్‌ మోర్గాన్‌ ఔటయ్యాడు. భారీ షాట్‌ ఆడబోయి బంతిని గాల్లోకి షాట్‌ ఆడాడు. పంత్‌ క్యాచ్‌ ఇచ్చి మోర్గాన్‌ను ఔట్‌ చేశాడు. హార్దిక్‌ పాండ్య వేసిన 17వ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ 6 పరుగులే సాధించింది. ఈ ఓవర్‌లో స్టోక్స్‌(8) రెండు డబుల్స్‌, సింగిల్‌ తీశాడు. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమిండియాకు భువనేశ్వర్‌ కుమార్‌ మొదటి ఓవర్ లోనే శుభారంభం అందించాడు. మూడో బంతికి జాస్‌ బట్లర్‌(0)ను డకౌట్‌ చేశాడు.

ఇంగ్లాండ్‌ ఒక్క పరుగుకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లాండ్ తో తొలిటీ20 మ్యాచ్‌లో ఓటమిపాలైన కోహ్లీసేన.. రెండో టీ20 మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కనిపిస్తోంది. మరోవైపు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని ఇంగ్లండ్ ఉవ్విళ్లూరుతోంది.