Rohit Sharma
ముగిసిన తొలి రోజు ఆట
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా(110), కుల్దీప్ యాదవ్ (1) లు క్రీజులో ఉన్నారు.
జడేజా సెంచరీ..
అండర్సన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో రవీంద్రజడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికి ఇది నాలుగో సెంచరీ
సర్ఫరాజ్ ఖాన్ హాఫ్ సెంచరీ..
తన టెస్టు అరంగ్రేట మ్యాచ్‌లోనే సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. టామ్ హార్డ్లీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 48 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు.
In No Time!
5⃣0⃣ on Test debut for Sarfaraz Khan ? ?
Follow the match ▶️ https://t.co/FM0hVG5pje#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/F5yTN44efL
— BCCI (@BCCI) February 15, 2024
Ind vs Eng: గుజరాత్‌లోని రాజ్‌కోట్, సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్ట్ తొలి రోజు ఆట కొనసాగుతోంది. టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ధాటిగా ఆడుతున్నారు. రోహిత్ శర్మ సెంచరీ బాదగా, రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీ చేశాడు.
ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 102, రవీంద్ర జడేజా 68 పరుగులతో ఉన్నారు. స్కోరు 53 ఓవర్లకు 190/3గా ఉంది. యశస్వి జైస్వాల్ 10, శుభ్‌మన్ గిల్ 0, రజత్ పటిదార్ 5 పరుగులకే ఔట్ అయ్యారు. కాగా, టెస్టుల్లోకి సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ ఆరంగేట్రం చేశారు.
టీమిండియా
యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్ టీమ్
జాక్ క్రాలే, బెన్ డకెట్, అలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.
Virat Kohli : కోహ్లీ భార్యకు ఏమైంది? అనుష్కశర్మ ప్రెగ్నెన్సీలో సమస్యలు? ఏదీ నిజం?