IND vs ENG 5th T20I : ఫైనల్లో రోహిత్, విరాట్ కోహ్లీ కుమ్మేశారు.. ఇంగ్లాండ్ లక్ష్యం 225

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 హాఫ్ సెంచరీతో కుమ్మేశారు.

IND vs ENG 5th T20I : ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సులు) 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సు) 80 హాఫ్ సెంచరీ దాటేశాడు. ఆది నుంచి నిలకడగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. ఒక దశలో స్కోరు 94 పరుగుల వద్ద రోహిత్ తొలి వికెట్ కోల్పోయింది.

స్టోక్స్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి రోహిత్ పెవిలియన్ చేరాడు. రోహిత్ స్థానంలో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (32) పరుగులతో పర్వాలేదనిపించాడు. కానీ, 13.2 ఓవర్ లో రషీద్ బౌలింగ్‌లో రాయ్ కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. దాంతో భారత్ స్కోరు 143 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీతో జతగా హార్దిక్ పాండ్యా ఇద్దరు కలిసి పరుగుల వరద పారించారు. నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి విరాట్ కోహ్లీ (80), పాండ్యా (39) పరుగులతో నాటౌట్ గా నిలిచారు.


మొత్తంగా 2 వికెట్లు మాత్రమే కోల్పోయిన భారత్.. 224 పరుగులు చేసింది. ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 225 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో అడిల్ రషీద్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీసుకున్నారు. ఈ సిరీస్‌లో ఇరుజట్లు తలో రెండు మ్యాచ్‌లు గెలిచాయి. 2-2తో సిరీస్ సమం అయింది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుకే సిరీస్ సొంతం అవుతుంది. సిరీస్ లక్ష్యంగా ఇరుజట్లు పోటీపడుతున్నాయి. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టును కోహ్లీసేన కట్టడి చేయగలదా లేదా? టీ20 సిరీస్ ఎవరి సొంతం అవుతుందో చూడాలి.

 

 

ట్రెండింగ్ వార్తలు