×
Ad

Suryakumar Yadav : తిరువనంతపురం వేదిక‌గా న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌.. సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు..

ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు సూర్య‌కుమార్ యాద‌వ్‌ను (Suryakumar Yadav ) ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Ind Vs Nz 5th T20 Suryakumar Yadav Need 33 Runs To Join 3000 T20i Runs

Suryakumar Yadav : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ మైదానంలో భార‌త్‌, న్యూజిలాండ్‌ జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం ఐదో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు భార‌త టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఓ అరుదైన ఘ‌నత ఊరిస్తోంది.

ఈ మ్యాచ్‌లో గ‌నుక సూర్య 33 ప‌రుగులు చేస్తే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున 3 వేల‌ ప‌రుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో ఈ ఘ‌న‌త సాధించిన మూడో భార‌త బ్యాట‌ర్ గా రికార్డుల‌కు ఎక్కుతాడు. అంతేకాదు..ఈ మైలురాయిని అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో చేరుకున్న రెండో భార‌త ప్లేయ‌ర్‌గా నిలుస్తాడు.

Arjun Tendulkar : అతి పెద్ద మైలురాయిని చేరుకున్న అర్జున్ టెండూల్క‌ర్.. అయినా కూడా తండ్రి క‌న్నా చాలా వెనుకే

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు మాత్ర‌మే 3 వేల ప‌రుగుల మైలురాయిని అందుకున్నాడు.

రోహిత్ శ‌ర్మ 159 టీ20 మ్యాచ్‌ల్లో 4231 ప‌రుగులు చేయ‌గా, కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 4188 ప‌రుగులు సాధించాడు. ఇక సూర్య‌కుమార్ యాద‌వ్ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 103 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 97 ఇన్నింగ్స్‌ల్లో 36.6 స‌గ‌టు 164.7 స్ట్రైక్‌రేటుతో 2967 ప‌రుగులు సాధించాడు.

ఇక భార‌త్ ప్లేయ‌ర్ల‌లో టీ20ల్లో అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో మూడు వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్న ఆట‌గాడి రికార్డు కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ 81 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త సాధించ‌గా రోహిత్ శ‌ర్మ 108 ఇన్నింగ్స్‌ల్లో దీన్ని అందుకున్నాడు.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. క‌మిన్స్ దూరం, స్టీవ్ స్మిత్‌కు నో ప్లేస్‌..

అతి త‌క్కువ ఇన్నింగ్స్‌ల్లో భార‌త్ త‌రుపున 3 వేల టీ20 ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు వీరే..

* విరాట్ కోహ్లీ – 81 ఇన్నింగ్స్‌ల్లో
* రోహిత్ శ‌ర్మ – 108 ఇన్నింగ్స్‌ల్లో