India vs South Africa: బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా.. ఒక్క మార్పూ లేకుండా టీమిండియా..
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
PIC: @BCCI (X)
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇవాళ భారత్, దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
భారత జట్టు ఒక్క మార్పూ లేకుండా బరిలోకి దిగింది. సూర్యకుమార్ యాదవ్ టాస్ సందర్భంగా మాట్లాడుతూ.. “మేము కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలని అనుకున్నాం. ప్రతి ఒక్కరూ తమ ప్రతిభ చూపించే మంచి అవకాశం ఇది.
మైదానంలో మంచి ఉత్సాహంతో ఉన్నాం. ఏ ఫలితం వచ్చినా స్వీకరిస్తాం. ముందుగా బౌలింగ్ చేస్తుండడం హ్యాపీనే. అక్షర్ పటేల్ విషయంలో కాస్త కఠిన నిర్ణయం తీసుకున్నాం. ఇదే జట్టుతో కొనసాగుతున్నాం. కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు లేవు” అని తెలిపాడు.
Also Read: T20 World Cup 2026: శ్రీలంకపై ఇంగ్లాండ్ ఘన విజయం
భారత జట్టు: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి
దక్షిణాఫ్రికా జట్టు: ఏడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డీ కాక్ (వికెట్ కీపర్), ర్యాన్ రికెల్టన్, డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో యాన్సెన్, కోర్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడా, లుంగి ఎన్గిడి
