IND vs SA : టాస్ గెలిచిన దక్షిణాప్రికా.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్.. పంత్‌కు నో ప్లేస్.. ముగ్గురు స్పిన్నర్లు..
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య (IND vs SA ) రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
- Thota Vamshi Kumar
- Updated on- November 30, 2025 / 01:18 PM IST
IND vs SA 1st ODI South Africa opt to bowl no place for Rishabh Pant
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాంచి వేదికగా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
‘మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. రాత్రి పూట మంచు కురుస్తుంది. దీంతో బ్యాటింగ్ చేయడం సులువు అవుతుంది. డ్రెస్సింగ్ రూమ్ మొత్తం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ సిరీస్ ఎంతో ముఖ్యమైంది. వన్డే ప్రపంచకప్ 2027 ఇంకా సమయం ఉంది. ఈ మెగాటోర్నీ కోసం జట్టును సన్నద్ధం చేసుకుంటున్నాం. నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో ఈ మ్యాచ్‌లో ఆడనున్నాం. టెంబా బవుమా, కేశవ్ మహారాజ్‌లకు విశ్రాంతి ఇచ్చాం.’ అని మార్‌క్రమ్ అన్నాడు.
Andre Russell : ఆండ్రీ రస్సెల్ సంచలన నిర్ణయం.. ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్.. సరికొత్త పాత్రలో..
‘టాస్ గెలిస్తే మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలని అనుకున్నాం. ఈ సిరీస్ కోసం చాలా మంచిగా సన్నద్ధం అయ్యాం. సీనియర్ ఆటగాళ్ల పాటు చాలా మంది ప్లేయర్లు జట్టులోకి వచ్చారు. వన్డే జట్టులో మనకు లభించే ప్రతి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. చాలా మంచి జట్టుతో బరిలోకి దిగుతున్నాం. మా నైపుణ్యాలను ప్రదర్శించేందుక ఇదొక అవకాశం. ఈ మ్యాచ్‌లో మేము ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లతో ఆడుతున్నాం.’ అని టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా తుది జట్టు..
ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, ప్రేనెలన్ సుబ్రేయన్, నాండ్రే బర్గర్, ఒట్నీల్ బార్ట్‌మాన్
భారత తుది జట్టు..
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్(కెప్టెన్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
