×
Ad

IND vs SA : బుమ్రా పాంచ్ ప‌టాకా.. తొలి ఇన్నింగ్స్‌లో ద‌క్షిణాఫ్రికా ఆలౌట్‌.. స్కోరెంతంటే?

తొలి టెస్టు మ్యాచ్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా ధాటికి ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు (IND vs SA ) విల‌విల‌లాడారు.

IND vs SA 1st test Jasprit Bumrah five wickets South Africa 159 all out in 1st Innings

IND vs SA : రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా భార‌త్, దక్షిణాఫ్రికా జ‌ట్లు తొలి టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేస్ గుర్రం జ‌స్‌ప్రీత్ బుమ్రా ధాటికి ద‌క్షిణాఫ్రికా బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు. బుమ్రా ఐదు వికెట్లతో చెల‌రేగ‌డంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవ‌ర్ల‌లో 159 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

స‌ఫారీ బ్యాట‌ర్ల‌లో ఐడెన్ మార్‌క్ర‌మ్ (31), వియాన్ ముల్డర్ (24), టోనీ డి జోర్జీ (24), ర్యాన్ రికెల్టన్ (23) లు ప‌ర్వాలేద‌నిపించారు. కెప్టెన్ టెంబా బ‌వుమా (3) ఘోరంగా విప‌లం అయ్యాడు. ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (15 నాటౌట్‌) అజేయంగా నిలిచాడు. భార‌త బౌల‌ర్ల ధాటికి ఐదుగురు బ్యాట‌ర్లు సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం.

Kuldeep Yadav : పెళ్లి చేసుకుంటాన‌య్యా.. సెల‌వు ఇవ్వండి.. బీసీసీఐకి కుల్దీప్ యాద‌వ్ రిక్వెస్ట్‌.. !

భార‌త బౌల‌ర్ల‌లో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, కుల్దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. అక్ష‌ర్ ప‌టేల్ ఓ వికెట్ సాధించాడు.