Kuldeep Yadav : పెళ్లి చేసుకుంటానయ్యా.. సెలవు ఇవ్వండి.. బీసీసీఐకి కుల్దీప్ యాదవ్ రిక్వెస్ట్.. !
టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు.
Kuldeep Yadav requests BCCI to grant leave for wedding reports
Kuldeep Yadav : టీమ్ఇండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలోనే ఓ ఇంటి వాడు కానున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు వంశికను పెళ్లి చేసుకోనున్నాడు. ఈ క్రమంలో అతడు బీసీసీఐకి స్పెషల్ రిక్వెస్ట్ చేసుకున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివరిలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని, తనకు సెలవు మంజూరు చేయాల్సిందిగా అతడు బీసీసీఐని అభ్యర్థించినట్లుగా తెలుస్తోంది.
కుల్దీప్ యాదవ్ తన వివాహం కోసం నవంబర్ చివరి వారంలో సెలవు కోరాడు. ప్రస్తుతం అతడు బీసీసీఐ నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నట్లు టైమ్స్ ఆఫ్స్ ఇండియా తన కథనంలో తెలిపింది.
PAK vs SL : పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్.. భారీ జరిమానా..
‘కుల్దీప్ వివాహం నవంబర్ చివరి వారంలో జరగనుంది. అతనికి ఖచ్చితమైన సెలవుల సంఖ్యను మంజూరు చేసే ముందు అతని సేవలు ఎప్పుడు అవసరమో జట్టు యాజమాన్యం అంచనా వేస్తుంది.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది.
టీమ్ఇండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్‌కు కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) ఎంపిక అయ్యాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. తుది జట్టులోనూ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కింది.
ఈ ఏడాది జూన్‌లో వంశికతో కుల్దీప్ యాదవ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఆ సమయంలోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికి ఐపీఎల్ ముగింపు ఆలస్యం కావడంతో పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. ఒక వేళ బీసీసీఐ అతడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని సెలవులు మంజూరు చేస్తే అతడు దక్షిణాఫ్రికాతో నవంబర్ 22 నుంచి జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌తో పాటు 30 నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
KKR : ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ కీలక నిర్ణయం.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్..
ఎవరీ వంశిక..
వంశిక స్వస్థలం లక్నోలోని శ్యామ్ నగర్. ప్రస్తుతం ఆమె లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC)లో పనిచేస్తుందని తెలుస్తోంది. వంశిక, కుల్‌దీప్ యాదవ్ లు పాఠశాల నుంచే స్నేహితులు. వీరి స్నేహం ఈక్రమంగా ప్రేమగా మారింది. వీరిద్దరు ఇరు కుటుంబ సభ్యులను పెళ్లికి ఒప్పించారు.
