KKR : ఐపీఎల్ 2026కి ముందు కేకేఆర్ కీలక నిర్ణయం.. అసిస్టెంట్ కోచ్‌గా షేన్ వాట్సన్..
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR )కీలక నిర్ణయం తీసుకుంది.
Kolkata Knight Riders announce Shane Watson as assistant coach ahead of IPL 2026
KKR : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌ను నియమించింది.
ఆస్ట్రేలియా తరఫున ఆల్ టైమ్ గ్రేట్స్‌లో ఒకరైన వాట్సన్ కేకేఆర్ ప్రధాన కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి పనిచేయనున్నాడు. కేకేఆర్ (KKR) జట్టుకు వెస్టిండీస్ మాజీ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో మెంటర్‌గా కొనసాగనున్నాడు.
PCB : ట్రై సిరీస్ వేదిక మార్చిన పాక్.. ఇస్లామాబాద్ నుంచి..
షేన్ వాట్సన్ నియామకం పై కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ స్పందించారు. ‘షేన్ వాట్సన్‌ను కేకేఆర్ కుటుంబంలోకి స్వాగతిస్తున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఆటగాడిగా, కోచ్‌గా అతని అనుభవం మా జట్టు సంస్కృతికి, సన్నద్ధతకు అపారమైన విలువను జోడిస్తుంది. టీ20 ఫార్మాట్‌పై అతని అవగాహన, మైదానంలో, వెలుపల అతని సహకారాల కోసం మేము ఎదురుచూస్తున్నాము.’ అని మైసూర్ తెలిపారు.
What a day, Watt-o Knight! 🙌
Welcome to the Family, @ShaneRWatson33 💜 pic.twitter.com/hpOclOv7LA
— KolkataKnightRiders (@KKRiders) November 13, 2025
Rishabh Pant : దేవుడు దయగలవాడు.. రిషబ్ పంత్ కామెంట్స్ వైరల్..
ఇక అసిస్టెంట్ కోచ్‌గా రావడం పట్ల షేన్ వాట్సన్ ఆనందం వ్యక్తం చేశాడు. ‘కోల్‌కతా నైట్ రైడర్స్ లాంటి ఐకానిక్ ఫ్రాంచైజీలో భాగం కావడం గొప్ప గౌరవం. కేకేఆర్ అభిమానుల అభిరుచిని, నిబద్ధతను నేను ఎల్లప్పుడూ ఆరాధిస్తాను. కోల్‌కతాకు మరో టైటిల్‌ను తీసుకురావడానికి కోచింగ్ గ్రూప్, ఆటగాళ్లతో కలిసి పనిచేయడానికి నేను ఆసక్తిగా ఉన్నాను .’ అని వాట్సన్ తెలిపారు.
